Begin typing your search above and press return to search.

హత్య చేసి 35 ముక్కలుగా కట్ చేసి ఢిల్లీ అంతా విసిరిన దుర్మార్గుడు

By:  Tupaki Desk   |   14 Nov 2022 10:05 AM GMT
హత్య చేసి 35 ముక్కలుగా కట్ చేసి ఢిల్లీ అంతా విసిరిన దుర్మార్గుడు
X
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగుచూసింది. ఒక యువతిని హత్య చేసి 35 ముక్కలుగా కట్ చేసి ఢిల్లీ అంతా విసిరికొట్టారు. ఇంతటి దారుణ హత్య కేసు విచారణ సమయంలో విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. మృతురాలు శ్రద్ధా (26) ముంబైలోని ప్రముఖ సంస్థ కాల్ సెంటర్ లో పనిచేసేది ఆమెను ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా ఇలా హత్య చేసినట్టు విచారణలో తేలింది.

శ్రద్ధకు అఫ్తాబ్ అమీన్ పూలావాలతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి.. ఇద్దరూ సహజీవనం చేసే వరకూ సాగింది. అయితే వారి బంధాన్ని ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. దాంతో వారు ముంబై నుంచి ఢిల్లీకి పారిపోయి మెహ్రౌలీలో ఒక ఫ్లాట్ లో ఉండేవారు. కానీ వారి మధ్య పెళ్లి గురించి గొడవలు జరుగుతుండేవి.

అవి ఒక రోజు తీవ్రరూపం దాల్చి ఇద్దరూ ఘర్షణకు దిగారు. ఈ క్రమంలోనే శ్రద్ధను అమీన్ హత్య చేశాడు. మే 18న ఈ ఘటన జరిగింది. తర్వాత ఆ హత్యను దాచిపెట్టేందుకు అమీన్ వ్యవహరించిన తీరు విన్న పోలీసులు షాక్ కు గురయ్యారు.

శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలు చేసి.. వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టారు. 18 రోజుల పాటు అర్థరాత్రి రెండు గంటల సమయంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాటిని విసిరేశారు. అలా ఆ మృతదేహం జాడ లేకుండా చేశారు.

శ్రద్ధ ఫోన్ ఎత్తకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం మొదలైంది. నవంబర్ 8న ఆమె తండ్రి ఢిల్లీలోని వారి ఇంటికి వచ్చాడు. కానీ ఆ ఫ్లాట్ కు తాళం వేసి ఉంది.

దాంతో అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాని ఆధారంగా శనివారం అమీన్ ను అరెస్ట్ చేశారు. శ్రద్ధ తనను పదే పదే పెళ్లి చేసుకోవాలని కోరడం వల్లే తమ మధ్య గొడవలు జరిగేవని అమీన్ విచారణలో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ ఖేసు దర్యాప్తు కొనసాగుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.