Begin typing your search above and press return to search.
కరోనా: దూరం జరగమన్నందుకు హత్య
By: Tupaki Desk | 25 March 2020 7:30 PM GMTకరోనా వైరస్ ప్రబలకుండా దేశంలో లాక్ డౌన్ విధించారు. ఏ ఇద్దరు బయట కనిపించకుండా నిషేధం విధించారు. సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయితే కొందరు మాత్రం దీనిని పెడచెవిన పెడుతున్నారు.
తాజాగా గుంపులుగా తిరగవద్దని.. దూరం పాటించామన్నందుకు తమిళనాడులో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన వైనం కలకలం రేపింది. తమిళనాడులోని ఊటీలో ఈ దారుణం జరిగింది.
రోజువారీ కూలీగా పనిచేసే జోతిమణి (40)ని చంపేశారు. బేకరిలో పనిచేసే కేరళకు చెందిన దేవదాస్ హోటల్ కు టీ తాగడానికి వచ్చాడు. జోతిమణి భోజనం చేస్తుండగా దేవదాస్ వచ్చిపక్కన కూర్చుండే ప్రయత్నం చేశాడు. కరోనా వ్యాపిస్తోందని దూరంగా కూర్చోవాలని జోతిమణి కోరాడు. తననే పక్కకు వెళ్లమంటావా అని ఆగ్రహించిన దేవదాస్ కత్తి తీసుకొని జోతిమణిని పొడిచేశాడు. స్థానికులు స్పందించి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు.
ఇలా కరోనా వైరస్ భయం.. వివాదానికి దారి తీసి చివరకు ఒకరి ప్రాణాలు తీసేలా చేసింది. చిన్న వివాదం పెద్దగా మారి ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైంది.