Begin typing your search above and press return to search.
లైవ్ లో రిపోర్ట్ చేస్తున్న రిపోర్టర్ కు చేదు అనుభవం
By: Tupaki Desk | 28 Sep 2019 4:52 AM GMTలైవ్ లో ఉన్న టీవీ రిపోర్టర్ కు చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికాకు చెందిన ఒక టీవీ చానల్ మహిళా రిపోర్టర్ లైవ్ లో వార్తల్ని చెబుతున్న వేళ.. అనుమానాస్పదంగా సంచరించిన గుర్తు తెలియని వ్యక్తి ఒకరు చేసిన పనితో ఆమెకు షాకింగ్ గా మారింది. అనూహ్యంగా చోటు చేసుకున్న సమయంలోనూ..ఆమె సమయస్ఫూర్తితో వ్యవహరించిన వైనంపై పలువురు అభినందిస్తున్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే?
అమెరికాకు చెందిన వేవ్ 3 న్యూస్ ఛానల్ లో పని చేస్తున్న సారా రివస్ట్.. న్యూస్ రూంలో ఉన్న యాంకర్ తో లైవ్ లో మాట్లాడుతోంది. ఆమె వెనుక ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తచ్చాడాడు. వార్త గురించి చెబుతూనే.. అలెర్ట్ గా ఉంది సారా. అనూహ్యంగా ఆమెకు దగ్గరగా వచ్చి బుగ్గమీద ముద్దాడటంతో.. చివరి క్షణాల్లో అతని నుంచి దూరంగా జరిగిన ఆమె.. అలాంటి పరిస్థితుల్లోనూ వార్తను చెప్పటం ఆపలేదు.
అనూహ్యంగా ఆమెను ముద్దాడిన ఆకతాయిపై సారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముద్దు పెట్టి వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ఎరిక్ గుడ్ మ్యాన్ గా గుర్తించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు సెకండ్ల సంచలన కోసం తెగబడిన ఇతగాడు రానున్న రోజుల్లో చట్టపరమైన పలు సమస్యలు ఎదుర్కోవటం ఖాయమంటున్నారు. ఇతగాడు చేసిన పనికి భారీ జరిమానాతో పాటు.. ఆర్నెల్ల వరకూ జైలుశిక్ష తప్పదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సారా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేవారు. మూడు సెకండ్ల ఫేమ్ కోసం ప్రయత్నించిన అతగాడి తీరును ఆమె తప్ప పట్టారు. ఇందుకు సంబంధించిన చిట్టి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.