Begin typing your search above and press return to search.

అతడు ముద్దిచ్చాడు.. ఆమె చచ్చిపోయింది

By:  Tupaki Desk   |   14 Jun 2016 11:45 AM GMT
అతడు ముద్దిచ్చాడు.. ఆమె చచ్చిపోయింది
X
ప్రియుడు ప్రేమతో ప్రియురాలికి ముద్దు పెడితే ఎంత బాగుంటుందో కదా? కానీ.. ప్రేమతో ప్రియురాలికి ఒక ప్రియుడు పెట్టిన ముద్దు ఆమె ప్రాణాల్ని తీసేసింది. నమ్మినా నమ్మకున్నా ఇది నిజం. ఒక ముద్దు ఒక ప్రాణాన్ని ఎలా తీయగలదు? అన్న ప్రశ్న మామూలే. కానీ.. ఈ విషయంలోకి వెళితే మాత్రం షాకింగ్ గా అనిపించటమే కాదు.. ఇలా కూడా జరుగుతుందా? అనిపించక మానదు. ప్రియురాలికి ప్రియుడు ఇచ్చిన ముద్దు ఆమెను అనంత లోకాలకు వెళ్లిపోయేలా చేసిందన్నది ఎలా సాధ్యమన్న విషయంలోకి వెళితే..

నిజానికి ఈ ఉదంతం కొన్ని రోజుల క్రితం చోటు చేసుకున్నది. కానీ.. ప్రియుడి ముద్దుతో ఆమె ఎలా చనిపోయిందన్న విషయంపై పరిశోధన చేసిన వారికి ఈ మధ్యనే అసలు విషయం తెలిసిందే. ఇక.. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్ కు చెందిన 20 ఏళ్ల మరియమ్ కుఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఒక రోజు బాయ్ ఫ్రెండ్ ను కలవటానికి మరియమ్ అతనున్న హోటల్ రూంకి వెళ్లింది. చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చుకున్నారు. చివరకు ఆమె వెళ్లే సమయంలో అతగాడు.. ఆమెకు లిప్ కిస్ ఇచ్చాడు.

ప్రియుడితో కిస్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత.. ఆమెకు నిద్రపట్టలేదు. ఊపిరి కూడా పీల్చటం కష్టమైంది. చివరకు చాలాసేపు పోరాడి.. తుదిశ్వాస విడిచింది. ఆమెకు శవపరీక్ష జరిపిన వైద్యులు.. ఆమెకు ఊపిరి ఆడకపోవటం వల్ల మరణించినట్లుగా తేల్చారు. అదెలా సాధ్యమన్న ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేసిన వైద్యులు.. ఆమె మెదడుకు ఆక్సిజన్ అందకపోవటం వల్లే ఆమె చనిపోయిందన్న విషయాన్ని తేల్చారు.

అదెలా జరిగిందన్న విషయాన్ని మరింత డీప్ గా అధ్యయనం చేసిన వారికి షాక్ తినే విషయం ఒకటి బయటకు వచ్చింది. అదేమంటే.. ఆమె చనిపోవటానికి బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన కిస్సేనని తేల్చారు. అదెలానంటే.. ప్రియురాలికి కిస్ ఇవ్వటానికి ముందు.. సదరు ప్రియుడు పీనట్ బటర్ స్కాచ్ శాండ్ విచ్ తిన్నాడు. చిన్నతనం నుంచి అస్తమాతో బాధపడే మరియమ్ కు వేరుశనగ అంటే అలర్జీ. పీనట్ బటర స్కాచ్ శాండ్ విచ్ తిన్న నోటితో గాఢంగా ముద్దు పెట్టేసరికి.. ఆ అలెర్జీ కారణంగా ఊపిరి ఆడక మరియమ్ మరణించినట్లు తేల్చారు. ప్రియుడి ముద్దు ప్రియురాలి ప్రాణం తీయటం షాకింగ్ గా అనిపించట్లేదు..?