Begin typing your search above and press return to search.

అంబులెన్స్ రాలేద‌ని అక్క‌డే చంపేశారు

By:  Tupaki Desk   |   18 Jan 2016 4:00 PM GMT
అంబులెన్స్ రాలేద‌ని అక్క‌డే చంపేశారు
X
చట్టాన్ని కాపాడుతూనే మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హరించాల్సిన పోలీసులు మ‌రో వారు త‌మ వివాదాస్ప‌ద తీరుతో వ్య‌వ‌హ‌రించారు. అవ‌కాశం దొరికితే రూల్స్ మాట్లాడే పోలీసులు మ‌రోమారు అదే రూల్స్‌ తో ప్ర‌మాదంలో ఉన్న ఓ వ్య‌క్తి చావుకు కార‌ణ‌మ‌య్యారు. నిర్వాకం అంతా ఇంట‌ర్నెట్ లో ఎక్క‌డా పోలీసుల తీరు తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయింది.

కేర‌ళ‌లోని తిరువనంతపురంలో విక్రం సారాబాయ్ స్పేస్ సెంటర్ కు చెందిన వాహనం ఓ వృద్ధున్ని ఢీకొట్టింది. అతని కాలు దాదాపు శరీరం నుంచి విడిపోయింది, దీంతో తీవ్రరక్తస్రావం జరిగింది. అయితే అదే స‌మ‌యంలో అక్కడ ఉన్న పోలీసులు ఈ విష‌యాన్ని లైట్ తీసుకున్నారు. ఇంత ఘోర‌మైన ప‌రిస్థితుల్లో ఉన్న ఆ వృద్ధుడిని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించలేదు. ఇలా అరగంట పాటూ రక్తపు మడుగులో ఉన్న ఆ ముస‌లి వ్య‌క్తి న‌ర‌కం భ‌రించ‌లేక త‌నువు చాలించాడు. అయితే స్థానికంగా ఉన్న ఓ వ్య‌క్తి ఈ పోలీసుల త‌తంగం అంత‌టినీ వీడియో తీసి ఇంట‌ర్నెట్ లో పోస్ట్ చేశారు. దీంతో పోలీసుల నిర్వాకం బ‌య‌ట‌ప‌డింది. పోలీసుల తీరుపై నెటిజ‌న్లు ఫుల్ ఫైర‌య్యారు.

ఎప్ప‌ట్లాగే పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై త‌మ‌దైన శైలిలో తాపీగా స్పందించారు. కాలు ఊడిపోయిన ప‌రిస్థితుల్లో వృద్ధుడు ఉండ‌టం అంబులెన్స్ త‌ప్ప‌నిస‌రి కావాల్సి వ‌చ్చింద‌ని అందుకే తాము ఆస్ప‌త్రికి తీసుకుపోలేద‌ని చెప్పారు. కొస‌మెరుపు ఏంటంటే...ఆస్ప‌త్రికి త‌ర‌లించేందుకు స‌మ‌యం తీసుకున్న పోలీసులు...స‌ద‌రు వృద్ధుడు కేర‌ళావాసి కాద‌ని మాత్రం త్వ‌ర‌గానే తేల్చారు!!