Begin typing your search above and press return to search.
నోట్లు మార్చలేదని ఉద్యోగంలోంచి తీసేశాడు..
By: Tupaki Desk | 22 Nov 2016 5:37 AM GMTపెద్ద నోట్ల రద్దు వ్యవహారం సమాజంపై చూపుతున్న ప్రభావం అంతాఇంతా కాదు. ఇప్పటివరకు నగదు మార్చుకోవడం కోసం దారులు వెతకడం... నగదు మార్చుకోవడం కోసం పడరాని పాట్లు పడడం... చేతిలో నగదు లేక ఇబ్బందులు పడడమే కనిపించాయి. క్రమంగా ఇతర పెడ ధోరణులూ మొదలైపోతున్నాయి. అలాంటి ఘటనలు ఒక్కటొక్కటిగా మొదలైపోతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఒక చిరుద్యోగి తన యజమానికి చెందిన పాత 500 నోట్లను తన ఖాతాలో వేసుకుని మార్చిపెట్టడానికి నిరాకరించినందుకు ఉన్న ఆ చిన్నపాటి ఉపాధిని పోగొట్టుకోవాల్సి వచ్చింది.
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు నరసింహరావుపేట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పాలకొల్లు పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో బంక్ యజమానుల్లో ఒకరు తానిచ్చే రూ.2.35 లక్షల (అన్నీ రూ.500 - రూ.1000 నోట్లు)ను ఆ ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో వేసుకోవాలని సూచించాడు. ఈ నోట్ల గొడవ తేలిన తరువాత ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసి తనకు ఇవ్వాలని కోరాడు.
అయితే.. కేంద్ర ప్రభుత్వం నిత్యం చేస్తున్న సూచనలు విన్న ఆ యువకుడు అందుకు నిరాకరించాడు. అలా చేస్తే తనకు ఇబ్బంది కలుగుతుందని, దీనిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆరా తీస్తే చిక్కుల్లో పడతానని చెప్పాడు. దీంతో ఆ యజమాని 'నా దగ్గర పనిచేస్తూ నా మాటనే ధిక్కరిస్తావా' అంటూ అతడిని ఉద్యోగం నుంచి తొలగించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/