Begin typing your search above and press return to search.
జూదంలో భార్య - పిల్లలను ఓడాడు!
By: Tupaki Desk | 28 March 2018 4:37 AM GMTమహాభారతంలో ద్రౌపధిని పణంగా పెట్టి పాచికలాడిన పాండవుల్లా...జూదంలో కుటుంబ సభ్యులను పణంగా పెట్టడం అనేది ఎక్కడెక్కడో జరిగినట్లు అప్పుడప్పుడూ విదేశాల్లో జరిగినట్లు చదువుతుంటాం. అయితే మనదేశంలోనే ఇలాంటి నిర్వాకం చేశాడు ఓ ఘనుడు. ఢిల్లీలోని బులంద్ షెహర్ కు చెందిన ఓ వ్యక్తి జూదంలో భార్య - ఇద్దరు పిల్లలను పణంగా పెట్టి ఓడిపోయాడు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూదంలో గెలిచిన ఇమ్రాన్ అనే వ్యక్తి ఓడిన వ్యక్తి మోసిన్ ఇంటికి వెళ్లి అతడి భార్య - ఇద్దరు కొడుకులను తన వెంట రావాలని బలవంతం చేశాడు. తీవ్రంగా ప్రతిఘటించిన బాధితురాలు పంచాయతీ పెద్దలను ఆశ్రయించారు. పంచాయతీ పెద్దలు సైతం గెలిచిన వ్యక్తివద్దకు ముగ్గురు వెళ్లాల్సిందేనని హుకుం జారీచేశారు. దీంతో ఇమ్రాన్ ఒక బాబును తనవెంట తీసుకెళ్లాడు.
ఈ మొత్తం వ్యవహారంపై తీవ్ర ఆగ్రహానికి గురైన మోసిన్ భార్య తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. భర్తతో పాటు మరో ఐదుగురు వ్యక్తులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 2012లో ఆమె మోసిన్ ను వివాహం చేసుకున్నారు. అనంతరం వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. మోసిన్ జూదానికి బానిసయ్యాడు. తన అలవాటు కారణంగా 2015లో తన భార్య - బిడ్డలను జూదంలో పణంగా పెట్టి ఓడిపోయాడు. అనంతరం మోసిన్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. గత రెండేళ్లుగా తనకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి మొదటి భార్య అభ్యర్థించారు. అయినా, ఎవరూ ఆమెకు సహకరించలేదు. దీంతో ఆమె సెషన్స్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేయాలని సోమవారం ధర్మాసనం ఆదేశించింది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకొనేందుకు ప్రత్యేక పోలీసు బృందం గాలిస్తోంది.