Begin typing your search above and press return to search.
హైవే మీద వెంటాడి నరికి చంపేశాడు!
By: Tupaki Desk | 1 Jun 2019 4:50 AM GMTపట్టపగలు.. నడి రోడ్డు మీద.. వందల వాహనాలు నిలిచిపోయి.. అందరూ చూస్తుండగానే.. వెంటాడి వేటాడి మరి.. ఒక వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన పటాన్ చెర్వు రుద్రారం ప్రాంతంలో చోటు చేసుకుంది. నేషనల్ హైవే 65 రహదారి మీద జరిగిన ఈ దారుణ హత్యను అక్కడున్న వారు చూస్తుండిపోయారు.. వీడియోలు తీశారే తప్పించి.. ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఏడు నెలల క్రితం తమ వాడిని చంపారన్న కక్షతో ప్రతీకారం తీర్చుకున్న వైనం గగుర్పాటుకు గురి చేసింది.
హైదరాబాద్.. పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ప్రతీకార హత్యలురోడ్ల మీదా.. అందరూ చూస్తుండగానే జరిగిపోతున్నాయి. తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది. పది నిమిషాల పాటు తాను హత్య చేయాల్సిన వాడిని అత్యంత దారుణంగా నరికి.. తాపీగా తన దారిన తాను వెళ్లిపోయాడు. దీనికి సంబంధించినవీడియోలు.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం హైదరాబాద్ భోలక్ పూర్ కు చెందిన మహబూబ్ హుస్సేన్.. చర్లపల్లికి చెందిన హర్షద్ కలిసి రేషన్ బియ్యాన్ని అక్రమంగా వ్యాపారం చేసేవారు. వీరి మధ్య వ్యాపార గొడవలు వచ్చాయి. దీంతో అర్షద్ కు చెందిన రేషన్ బియ్యానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందజేశాడు హుస్సేన్. దీంతో కలిసి వ్యాపారం చేసిన వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఇవి పెరిగి పెద్దవై.. గత ఏడాది నవంబరులో మాట్లాడుకుందామంటూ అర్షద్ కు కబురు పంపి.. తన వారి అండతో దారుణంగా హతమార్చాడు హుస్సేన్. రాడ్ తో కొట్టి అర్షద్ ను చంపేసి.. ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. హత్యగా గుర్తించి నిందితుడు అర్షద్ ను ఏ1గా.. అతనికి సహకరించిన సమీర్ ను ఏ2గా నిర్దారిస్తూ రిమాండ్‌కు తరలించారు.అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చాడు.
ఈ కేసుకు సంబంధించిన విచారణ కోసం తాజాగా సంగారెడ్డిలోని కోర్టుకు హాజరై.. తిరిగి నగరానికి వెళ్లేందుకు స్కూటీపైన స్నేహితుడితో కలిసి బయలుదేరాడు. గుర్తు తెలియని దుండగుడు ఒకరు అర్షద్ ను వెంటాడాడు. స్కూటీని అడ్డుకున్నంతనే అర్షద్ వెంట ఉన్న స్నేహితుడు పరారయ్యాడు. కొబ్బరి బొండాలు కొట్టే కత్తిని పట్టుకొని అర్షద్ ను వెంటాడి దారుణంగా హతమార్చారు.
ఈ దురాగతం దాదాపు 10 నిమిషాలపాటు సాగింది. విచక్షణ రహితంగా కత్తితో వేట్లు వేస్తూ.. చనిపోయేవరకూ అదే తీరులో వ్యవహరించాడు. దీన్ని పెద్ద ఎత్తున చూస్తున్న ప్రజలు ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ హత్య నేపథ్యంలో నేషనల్ హైవే ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. దారుణంగా హత్య చేస్తున్న వారిని ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవటం గమనార్హం. మరో కీలకమైన విషయం ఏమంటే.. ఏడు నెలల క్రితం ఒకప్పటి తన వ్యాపార భాగస్వామిని అర్షద్ ఎక్కడ చంపాడో.. దానికి దగ్గరే అతగాడు హత్యకు గురి అయ్యాడు.