Begin typing your search above and press return to search.

సీఏఏ వ్యతిరేకులపై ఆగ్రహం.. యువకుడి కాల్పులు

By:  Tupaki Desk   |   2 Feb 2020 4:52 AM GMT
సీఏఏ వ్యతిరేకులపై ఆగ్రహం.. యువకుడి కాల్పులు
X
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ అట్టుడుకుతోంది. మొన్నీ మధ్యనే ఢిల్లీలోని ముస్లిం విద్యార్థులకు ఆలవాలమైన జామియా మిలియా యూనివర్సిటీలో కాల్పులు కలకలం రేపాయి. ఆ ఉదంతం మరువక ముందే శనివారం రాత్రి మరో ఘోరం చోటుచేసుకుంది.

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్ బాగ్ లో పెద్ద ఎత్తున మహిళలు - విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తుండగా ఓ ఆకతాయి యువకుడు కాల్పులకు దిగడం కలకలం రేపింది.

షాహిన్ బాగ్ లో నిరసనలు వ్యక్తం చేస్తున్న వేదికకు 250 మీటర్ల దూరంలోనే ఓ యువకుడు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. బారికేడ్ల వద్ద కాపలా కాస్తున్న పోలీసులు వెంటనే తేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.

యువకుడు గాల్లోకి కాల్పుల్లో ఎవరికి ప్రాణ నష్టం వాటిల్లలేదు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విచారణ జరపగా.. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా కాల్పులు జరిపినట్టు తెలిసింది. ముస్లిం యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళలకు వ్యతిరేకంగా ఇతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఉత్తరప్రదేశ్ లోని డల్లూపుర గ్రామానికి చెందిన కపిల్ గుజ్జర్ గా యువకుడిని గుర్తించారు. ఇతడు హిందుత్వ వాది అని సమాచారం.