Begin typing your search above and press return to search.
సీఏఏ ఆందోళనలు : గన్ తో పోలీస్ ని బెదిరించిన వ్యక్తి అరెస్ట్ ..!
By: Tupaki Desk | 25 Feb 2020 12:38 PM GMTదేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోన్న సీఏఏ వ్యతిరేక - అనుకూల ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. రాళ్లదాడిలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మంగళవారం మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతిచెందినవారి సంఖ్య ఏడుకు చేరింది. ఈశాన్య ఢిల్లీలో సీఏఏ అనుకూల - వ్యతిరేక వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారులు స్థానిక ఇళ్లకు - వాహనాలకు సోమవారం నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నాయి.
ఇకపోతే , అయితే, సీఏఏ వ్యతిరేక నిరసనకారుడొకరు తుపాకీ చేతపట్టి హల్ చల్ చేశాడు. డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ కు గురిపెట్టి బెదిరించాడు. జఫ్రాబాద్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. ఎరుపు రంగు టీషర్ట్ ధరించిన షారుఖ్.. చేతిలో పిస్టోల్ పట్టుకుని విధుల్లో ఉన్న పోలీసును బెదిరించాడు. దగ్గరకు వస్తే కాల్చి పడేస్తానని హెచ్చరించాడు. ఈక్రమంలో గాల్లోకి కాల్పులు కూడా జరిపాడు. దీనితో నిరాయుధుడైన కానిస్టేబుల్ వెనక్కి తగ్గకతగ్గలేదు. ఇక బయటకొచ్చిన వీడియా ఆధారంగా అతన్ని షారుఖ్ గా గుర్తించిన ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మారణాయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇకపోతే , సీఏఏ ఘర్షణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాత్రి ఢిల్లీ పోలీసులతో అత్యవర భేటీ నిర్వహించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఎమ్మెల్యేలతో భేటీ అయి ఉద్రిక్తతలు తగ్గించేందుకు చేపట్టే చర్యలపై చర్చించారు.