Begin typing your search above and press return to search.
భార్య కోసం అందమైన అడవినే నాటాడు
By: Tupaki Desk | 20 July 2016 9:34 AM GMT అర్జెంటీనాలోని అత్యంత సారవంతమైన నేలలున్న ప్రాంతమది.. దక్షిణ అమెరికాలోని పేరుగాంచిన పంపా గడ్డి మైదానాలు అవి. అన్ని రకాల పంటలు పండుతాయి. అలాంటి చోట భారీ అడవి.. అడవంటే దారీతెన్నూ తెలియని దుర్భర అరణ్యం కాదు. గిటార్ ఆకారంలో ఉన్న అందమైన వనమది. అడవేంటి.. గిటార్ ఆకారంలో ఉండడమేంటని ఆశ్చర్యపోవద్దు. అసలు సంగతి తెలిస్తే.. సలాం పెడ్రో అంటారు. ఇంతకీ ఈ పెడ్రో ఎవరు... ఈ గిటార్ ఫారెస్టుకీ ఆయనకు సంబంధం ఏంటో తెలియాలంటే మొత్తం చదవాల్సిందే.
పెడ్రో మార్టిన్ ఉరెటా అర్జెంటీనాలోని ఒక సామాన్య రైతు. ఇప్పుడతని వయసు 75 సంవత్సరాలు. ఈ గిటార్ అడవిని సృష్టించింది ఆయనే. ఆయన, ఆయన నలుగురు కొడుకులు కలిసి ఈ అడవిలోని ప్రతి మొక్కను నాటారు. ఒక్కటి కాదు, రెండు కాదు ఏకంగా 7 వేలకు పైగా మొక్కలను దశాబ్దాల కిందటే వారు నాటారు. కిలోమీటరు మేర ఈ అందమైన అడవి విస్తరించింది. ఈ గిటార్ ఫారెస్టు ఏర్పాటుకు స్ఫూర్తి పెడ్రో భార్య గ్రేసియాలా రిజాజ్.. ఆమె ఓసారి ఆ ప్రాంతం మీదుగా విమానంలో వెళ్తుండగా దిగువన అందమైన పంపా మైదానాలను చూసింది. అక్కడ తమకు ఇష్టమైన గిటార్ రూపంలో అడవి ఏర్పాటు చేద్దామని భర్తతో చెప్పింది. ఆయన నవ్వి ఊరుకున్నాడు.
అది జరిగిన కొన్నాళ్లకు 1977లో ఆమె ఒక రోజు అకస్మాత్తుగా సెరిబ్రల్ ఎనీరిజమ్ కారణంగా కుప్పకూలి మరణించింది. అప్పటికి ఆమె నిండు గర్భవతి. ఆమె మరణంతో పెడ్రో ఎంతో ఆవేదన కు గురయ్యాడు. భార్య కోసం ఏమైనా చేయాలనుకున్నాడు. ఆమె కోరికను తీర్చాలన్న ఉద్దేశంతో గిటార్ వనాన్ని సృష్టించాడు. నలుగురు పిల్లలతో కలిసి స్వయంగా ప్రతి మొక్కా నాటి ఆమె కోరిన చోటే వనాన్ని తయారుచేశాడు. గిటార్ కు ఉన్న ఆరు తంత్రుల స్థానంలో నీలం రంగులో కనిపించే నీలగిరి చెట్లను.. మిగతావి సైప్రస్ మొక్కలు. ఇవన్నీ పెరిగి పెద్దయ్యాక అందమైన గిటార్ అడవి రూపుదిద్దుకుంది.
విమానంలోంచి చూస్తే ఇది అచ్చంగా గిటార్ లాగే కనిపిస్తుంది. అయితే... ఇంత అద్భుత వనాన్ని సృష్టించిన పెడ్రో మాత్రం ఇంతవరకు ఆకాశం నుంచి ఈ అద్భుతాన్ని చూడలేదట. ఆయనకు విమానమెక్కడమంటే భయం కావడంతో ఎన్నడూ ఈ గిటార్ అడవి స్వరూపాన్ని కనులారా చూసే ఛాన్సు రాలేదు. కేవలం పైనుంచి తీసిన ఫొటోలను మాత్రమే ఆయన చూశాడు.