Begin typing your search above and press return to search.

సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడిన పబ్ జీ ..ఎలా అంటే !

By:  Tupaki Desk   |   11 May 2020 5:45 AM GMT
సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడిన పబ్ జీ ..ఎలా అంటే !
X
పబ్ జి ..పబ్ జి ..ఈ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంటుంది. స్మార్ట్ ఫోన్ ఉపయగించే ప్రతి ఒక్కరు కూడా ఈ పబ్ జి గేమ్ కి బాగా అడిక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే పగలు , రాత్రి అనే తేడా లేకుండా ఈ పబ్ జి గేమ్ మయంలో పడి మునిగిపోతున్నారు. అయితే , ఇదే పబ్ జి ఇప్పుడు వందలమంది ప్రాణాలను కాపాడింది. నిన్నటిమొన్నటి వరకు పబ్ జి ఆడుతున్న వారిని చూసి తిట్టినవారే ..నేడు అదే పబ్ జి తో మేము ప్రాణాలతో ఇంకా బ్రతికే ఉన్నాం అని చెప్తున్నారు. అసలు పబ్ జి గేమ్ కి ..ప్రజల ప్రాణాలకి సంబంధం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ....?

పూర్తి వివరాలు చూస్తే ...తాజాగా విశాఖపట్నంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌. ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి విషవాయువు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది మరణించారు. ఇకపోతే ఈ ఎల్.జీ. పాలిమర్స్ నుండి విషవాయువు వెలువడ్డప్పుడు సైరన్ కూడా మోగించలేదు. కానీ , వందలమంది ఇంట్లో నుండి పరుగులు తీసి తమ ప్రాణాలని కాపాడుకోగలిగారు. ఇలా వారు ప్రాణాలని కాపాడుకోవడానికి ముఖ్య కారణంగా పబ్ జి ఆడుతున్న స్థానిక యువకులు.

నీలాపు కిరణ్ అనే యువకుడు రాత్రి 2 :30 నిముషాల వరకు పబ్ జి ఆడుతున్నాడు. ఏదో వాసన వస్తున్నట్టుగా గుర్తించి సురేష్ అనే యువకుడికి ఫోన్ చేసి చెప్పాడు. కిరణ్ అనే యువకుడి ఇల్లు ఈ సదరు ఎల్.జీ పాలిమర్స్ కంపెనీని ఆనుకొనే ఉంటుంది. మెల్లిమెల్లిగా వాసనా ఎక్కువ అవుతుండటంతో ఆ పబ్ జి గేమ్ ఆడుతున్న యువకులంతా బయటకి వచ్చి ...అసలు విషయాన్ని పసిగట్టి గట్టిగ అరుస్తూ అందరిని నిద్రలేపారు. ఆ యువకుల కేకలతో నిద్రలేచిన స్థానిక వాసులు అక్కడి నుండి ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు. అయితే , తొలుత ఈ వాయువు వాసనను గుర్తించిన కిరణ్ మాత్రం ఈ వాయువును అధికంగా పీల్వడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏదేమైనా ఊరికే పనిపాట లేకుండా పబ్ జీ ఆడుతున్నారంటూ ఇన్ని రోజులెవరినైతే ఊర్లో వారంతా తిట్టారో.. ఆ యువకుడు , ఆ పబ్ జి గేమ్ వారి ప్రాణాలను కాపాడింది.