Begin typing your search above and press return to search.
పులి ముందు చచ్చినట్లు నటించి బతికిపోయాడు
By: Tupaki Desk | 27 Jan 2020 1:30 AM GMTఓ పెద్ద పులికి ఒంటరిగా మనిషి దొరికితే వదులుతుందా? ఆ మధ్య హైదరాబాద్ లోని జూలో తన జోన్ లో పడ్డ మనిషి పులి ఎలా చీల్చి చెండాడి చంపేసిందో గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు ఓ వ్యక్తి పులి ముందే పడి ఉన్నా అతణ్ని ఏమీ చేయలేదు. ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యం కలుగుతోంది కదా? ఐతే దీనికి సంబంధించిన వీడియో చూడాల్సిందే. తన ముందే పులి ఉన్నా ఓ వ్యక్తి చలించకుండా - తన భయాన్ని బయటపెట్టకుండా చచ్చినవాడిలా పడున్నాడు. ఆ పులి ఏమనుకుందో ఏమో కానీ.. వెంటనే ఆ వ్యక్తిని ఏమీ చేయకుండా అక్కడే కూర్చుంది. ఈ లోపు జనాలు వచ్చి తరమడంతో భయపడి పారిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మహారాష్ట్రలోని భండారా జిల్లాలో చోటు చేసుకుంది.
దీనికి సంబంధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాస్వాన్ తాజాగా ట్విటర్ లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ పులి అడవి నుంచి అనుకోకుండా పంట పొలాల్లోకి రాగా.. దాన్ని గ్రామస్థులు తరిమే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఓ వ్యక్తి పులికి దొరికిపోయాడు. ఐతే తాను భయపడి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే.. లేదా పారిపోయే ప్రయత్నం చేస్తే పులి వెంటనే దాడి చేసి చంపేస్తుందని భావించిన ఆ వ్యక్తి అలాంటి సమయంలోనూ సమయస్ఫూర్తి ప్రదర్శించాడు. పులి ముందు కదలకుండా పడుకుని ప్రాణం లేనట్టుగా నటించాడు. ఈలోపు మిగతా గ్రామస్థులు ఆయుధాలతో పులిని సమీపిస్తూ అరవడంతో అది పారిపోయింది. వీడియో చూసిన వాళ్లందరూ ఆ వ్యక్తి సమయస్ఫూర్తిని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి