Begin typing your search above and press return to search.
సీన్ రివర్స్: లవ్వర్ ఇంటి ముందు ప్రియుడి ధర్నా
By: Tupaki Desk | 10 July 2019 9:52 AM GMTఅప్పుడెప్పుడో కొన్నేళ్ల క్రితం మౌన పోరాటం అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో అమాయకురాలైన మహిళను అధికారి ఒకరు ప్రేమించినట్లుగా నటించి.. తన కామవాంఛ తీర్చుకుంటాడు. తర్వాత తన దారి తాను చూసుకుంటాడు. దీంతో.. మరో దారి లేని సదరు బాధితురాలు ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగుతుంది. ఈ మూవీ అప్పట్లో పెను సంచలనంగా మారటమే కాదు.. సూపర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత కాలంలో ఎన్నో మౌనపోరాటాల్ని.. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నాలు చేశాం. ఇందుకు భిన్నమైన సీన్ ఒకటి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇప్పటివరకూ ప్రియుడు మోసం చేశారంటూ ప్రియురాలు రోడ్ల మీదకు రావటం ఒక ఎత్తు అయితే.. తాజాగా ప్రియురాలు తనను మోసం చేసిందంటూ ప్రియుడు ఇంటి ముందు ధర్నా చేయటం సంచలనంగా మారింది. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పడగల్ లో జరిగిన ఈ ధర్నా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉన్నట్లుండి ప్రియురాలు ఇంటి ముందుకు వచ్చిన అతడు.. ఆమె ఇంటి ముందు నిరసనకు దిగారు. దీంతో ఈ సీన్ చూసేందుకు స్థానికులు గుంపులుగా చేరారు.
తన కథ గురించి చెబుతూ.. స్థానిక యువతి తనను ప్రేమించిందని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. తర్వాత ముఖం చాటేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సదరు యువతితో తాను దిగిన ఫోటోల్ని చూపించాడు. తాను మోసపోయానంటూ కంటతడి పెట్టిన వైనం ఇప్పుడక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. యువకుడు చేసిన పనికి షాక్ తిన్న యువతి కుటుంబం తమ పరువు పోతుందంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అసలు జరిగిందేమిటన్న విషయం మీద ఆరా తీస్తున్నారు.