Begin typing your search above and press return to search.
పక్కింటివాళ్ల వేధింపులతో కరోనా పై గెలిచిన వ్యక్తి ఏం చేసాడంటే?
By: Tupaki Desk | 14 April 2020 12:10 PM GMTకరోనా మహమ్మారి దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో కరోనా పై విజయం సాధించాలంటే దేశం మొత్తం ఒకే దారిలో నడవాలి. ఈ కరోనా పై విజయం సాధించడానికి .. దేశంలోని ప్రతి ఒక్కరు సమైక్యతా స్ఫూర్తి ప్రదర్శిస్తున్నారు. అయితే , కొంతమంది కారణంగా సమైక్యతా స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. ఇలాంటి ఘటన ఒకటి మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది.
కరోనా మహమ్మారి బారినపడి, చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న ఓ యువకుడు తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. కారణం ఏంటంటే ...కరోనా పై విజయం సాధించి ఇంటికి వస్తే .. ఇరుగుపొరుగు వారు తనను దూరంగా పెట్టడంతో అతడు ఆవేదనకు గురై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని శివపురి పట్టణంలో జరిగింది.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు చూస్తే..మధ్యప్రదేశ్ లోని శివపురి పట్టణానికి చెందిన 28 ఏళ్ల ఈ వ్యక్తి మార్చి 18న దుబాయి నుంచి వచ్చాడు. అయితే , అప్పటికే అక్కడ కరోనా వ్యాప్తి చెందడం తో - అనుమానం వచ్చి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా ..అతడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మార్చి 24న ఆసుపత్రిలో చేరాడు. ఏప్రిల్ 4న డిశ్చార్జి అయ్యాడు. అయితే , కరోనా పోరులో గెలిచి - ఇంటికి చేరిన అతడిని ఇరుగుపొరుగు ప్రజలు సామాజికంగా బహిష్కరించారు. అతని ఎవరూ మాట్లాడేవారు కాదు. అంతేకాకుండా పాలు - కూరగాయలు అమ్మేవారిని కూడా యువకుడి ఇంటి వైపు వెళ్లనీయలేదు. దీనితో తీవ్రమైన మనోవేదనకి గురై తన ఇంటిని అమ్మేసి - మరో చోటుకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. కరోనా సోకింది అని తెలిసినపుడు కూడా నేను పెద్దగా బాధపడలేదు అని , కానీ చుట్టుపక్కల వారి ప్రవర్తన చూసిన తరువాత నేను చాలా బాధపడ్డాను అని చెప్పాడు. అయితే , ఈ ఘటన పై దర్యాప్తు చేస్తునట్టు శివపురి ఎస్పీ రాజేశ్ సింగ్ చందల్ తెలిపారు. కరోనా బాధితులను చుట్టుపక్కల వారు వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.