Begin typing your search above and press return to search.
ఆ నీచుడు మా ఆవుల్ని రేప్ చేస్తున్నాడు .. ఆదుకోండి !
By: Tupaki Desk | 6 Sep 2021 4:34 AM GMTఈ మధ్య కాలంలో అత్యాచార ఘటనలు ఎక్కువైపోయాయి. అత్యాచారాలు జరగకుండా ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, ఎంతమంది పోలీసులని ప్రత్యేకంగా నియమిస్తున్నా అత్యాచార ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయే తప్ప , తగ్గడం లేదు. పడచు పిల్లల నుండి పండు ముసలి వారి వరకు , చిన్న పిల్లల నుండి యువతుల వరకు అందరూ అత్యాచారాలకి గురౌతున్నారు. ఏ ఒక్కరికి సరైన రక్షణ లేకుండాపోయింది. ఇప్పుడు మూగజీవాలను సైతం వదలట్లేదు కొందరు ప్రబుద్ధులు. వారిని విచక్షణా జ్ఞానం కోల్పోయి పశువుల్లా ప్రవర్తిస్తున్నారంటాం. ఆ పశువులపైనే అత్యాచారం చేసే వాళ్లను ఏమనాలి. ఇలాంటి ఘటనే కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
సాధారణంగా మహిళపై అత్యాచారం జరిగింది , న్యాయం చేయండి అంటూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కేవారు ఉంటారు. కానీ కేరళ కొల్లం జిల్లా మయనాడ్ లోని కొందరు రైతులకు విచిత్ర సమస్య వచ్చి పడింది. వారంతా, తమకు జీవనాధారమైన ఆవులను అమ్ముకోవాల్సిన పరిస్థితి. వాటిని జాగ్రత్తగా చూసుకోలేమని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పశుపోషణతో మంచి ఆదాయం ఉంటుందిగా ఇలా ఎందుకు అనుకుంటున్నారా, దీనికి కారణం ఉంది. తమ ఆవులపై ఓ వ్యక్తి అత్యాచారం చేస్తున్నాడట.
ఇక్కడ 20 మంది పశుపోషకులు బాధితులుగా మారారు. 2021 జనవరి నుంచి తరచూ వారి ఆవులపై దాడి జరుగుతోంది. చాలా రోజుల వరకు వారికి అసలు విషయం తెలియలేదు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాకే.. అది లైంగిక దాడి అని తెలిసొచ్చింది. ఓ వ్యక్తి రోజూ గోడ దూకి పశువుల కొట్టాల్లోకి రావడం గమనించారు. తంబి అనే రైతుకు ఏడు ఆవులు ఉండేవి. వాటిల్లో నాలుగింటిని అమ్మేశాడు. కారణం..వాటిపై ఐదు సార్లు అత్యాచారం జరగడం. ఆవులను కట్టేసి కొట్టడమే కాకుండా నిందితుడు.. వాటి జననాంగాల్లో కర్రలను చొప్పించేవాడట. పొదుగులను రాళ్లతో కొట్టి గాయపర్చేవాడని ఆరోపించారు రైతులు. వాటికయ్యే చికిత్సను భరించలేకపోతున్నామని, ఇప్పటికీ ఇంజెక్షన్లు వేయాల్సి వస్తోందని భాదపడుతున్నారు.
ఎవరో వ్యక్తిగత కక్షతో మా ఆవులపై దాడి చేస్తున్నారనుకున్నా. ఆ తర్వాత చాలా మంది రైతులు ఇదే సమస్యను లేవనెత్తారు. అప్పుడే తెలిసింది.. ఈ వ్యక్తి అసహజ రీతిలో ఆవులపై లైంగిక కార్యకలాపాలు అని ,మిగతా రైతులదీ ఇదే సమస్య. ఇలా మొత్తం 20 మంది కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రంతా కాపలా కాస్తూ ఉండలేమని, నిందితుడి బారినుంచి, ఆవులను కాపాడుకోలేమని వాపోయారు. అతడ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే.. రైతులు అనుమానిస్తున్న వ్యక్తి మానసిక స్థితి బాలేదని చెప్పి పంపించేశారు పోలీసులు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.