Begin typing your search above and press return to search.
ఎయిర్ పోర్ట్ లో కాల్పులు... అంతటా హై అలర్ట్
By: Tupaki Desk | 18 March 2017 3:25 PM GMTపారిస్ లోని ఒర్లే విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా సిబ్బంది నుంచి గన్ ను లాక్కునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ఇటీవల ఉగ్ర దాడులు ఎక్కువ అయిన నేపథ్యంలో సెంటినల్ పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీ నిర్వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ దగ్గర ఉన్న పోలీసు నుంచి ఓ ఆగంతకుడు గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. దాంతో అతన్ని షూట్ చేశారు. ఈ ఘటనతో ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులను ఖాళీ చేయించారు. విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఆగంతకుడు ఎవరన్న విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు.
ఈ ఘటనతో ఓర్లీ విమానాశ్రయంలోని ప్రయాణికులను ఖాళీ చేయించారు. ప్యారిస్ అంతటా హైఅలర్ట్ ప్రకటించారు. ఈ సంఘటనపై భద్రతాసిబ్బంది మాట్లాడుతూ తీవ్రవాదుల కదలికలు ఉన్న నేపథ్యంలో మెరుగైన తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఓ అగంతకుడు తమ వద్దనున్న తుపాకిని లాక్కునే ప్రయత్నం చేశారని తెలిపారు. పౌరులు అనుమాస్పదంగా ఉన్న వారి వివరాలను తమకు అందించాలని కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/