Begin typing your search above and press return to search.
మందుబాబులపై పూల వర్షం ..ఎక్కడ , ఎందుకంటే ?
By: Tupaki Desk | 5 May 2020 10:10 AM GMTమందు బాబులు ....దేశానికీ వెన్నెముకలాంటివారు. అదేంటి దేశానికీ వెన్నెముక రైతులు కదా ! అని అనుకుంటున్నారా ఒకరకంగా మందుబాబులు కూడా దేశానికీ వెన్నుముకగా నిలుస్తున్నారు. అయితే, కరోనా కష్ట కాలంలో ఈ మందుబాబులు తాగడానికి చుక్క మందు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐతే , ఎట్టకేలకి మందుబాబుల కష్టాలు తెలుసుకున్న ప్రభుత్వం లాక్ డౌన్ నుండి వైన్ షాప్స్ కి సడలింపు ఇచ్చింది. దీనితో దేశ వ్యాప్తంగా ప్రతి వైన్ షాప్ ముందు భారీగా క్యూ లు కనిపిస్తున్నాయి. దాదాపుగా 40 రోజుల తరువాత దుకాణాలు తెరవడటంతో బాహుబలి సినిమా చూడటానికి సినీ అభిమానులు ఎగబడినట్టు ... అందరూ ఒక్కసారిగా మద్యం షాప్స్ పై పడ్డారు.
అయితే , ఈ తరుణంలోనే శ రాజధాని ఢిల్లీలో మద్యం ప్రియులకు అనూహ్య రీతిలో స్వాగతం లభించింది. మద్యం కోసం క్యూలైన్లలో నిల్చున్న మందుబాబులపై ఓ వ్యక్తి పూలవర్షం కురిపించాడు. ఇవాళ ఉదయం ఢిల్లీ చందర్ నగర్ లోని ఓ మద్యం షాపు వద్ద కిలో మీటర్ల మేర జనాలు బారులు తీరారు. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి... తన వెంట తెచ్చుకున్న పూలను తీసి మందు బాబులపై చల్లుతూ కనబడ్డాడు.. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. మరోవైపు భారీ లైన్లలో లిక్కర్ కోసం మండుటెండలో నిల్చున్న మందుబాబులపై మిర్జాపూర్ లో ఓ లిక్కర్ షాప్ యజమాని పూలు చల్లాడు.
ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మందుబాబులే ప్రభుత్వ ఖజానాని నింపేది అని ,మిరే ఈ దేశాన్ని కాపాడాలంటూ మందు బాబులపై పూలు చల్లారు. మొత్తానికి మన ట్యాక్స్ పేయర్స్ కి మంచి గౌరవం దక్కినట్టు అయ్యింది. అయితే మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అది అమలు అవ్వడం లేదు.