Begin typing your search above and press return to search.
నెంబరు మీద అంత పిచ్చ ఏందో..?
By: Tupaki Desk | 6 May 2016 2:45 PM GMTఫ్యాన్సీ నెంబర్ల మీద అభిమానం ఏ స్థాయిలో ఉంటుందనటానికి తాజాగా బయటకు వచ్చిన ఈ ఉదంతం అందరిని విస్మయానికి గురి చేస్తుంది. నెంబర్ల మీద ఆసక్తి ఉంటుంది కానీ.. మరీ ఈ రేంజ్ లోనా? అన్న డౌట్ అందరిలో వ్యక్తమవుతోంది. ఫ్యాన్సీ నెంబర్లను చేజిక్కించుకోవటానికి భారీగా డబ్బును వెచ్చించటానికి వెనుకాడకపోవటం తెలిసిందే. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ తాను కొన్న కొత్త కారు కోసం 10.5లక్షలు ఖర్చు చేసి మరీ తాను మనసు పడ్డ ‘9999’ నెంబర్ ను సొంతం చేసుకోవటం తెలిసిందే. తాజా ఉదంతాన్ని వింటే.. లక్షలు పెట్టిన కొన్న కారు కోసం ఆ మాత్రం కొనటం పెద్ద విషయమేమీ కాదన్న మాట అనక మానరు.
ఎందుకంటే.. ఏపీలోని నూజివీడు ఆర్టీవో కార్యాలయంలో ఏపీ 16 డీజీ 6666 అనే నెంబరు కోసం వేలంపాట జరిగింది. ఈ నెంబరును సొంతం చేసుకోవటానికి పోటాపోటీగా బిడ్డింగ్ జరిగింది. అంతకంతకూ పెరిగిన ఈ బిడ్డింగ్ లో తాను ముచ్చట పడ్డ నెంబర్ని సొంతం చేసుకోవటం కోసం ఆకుల వెంకటరాజు అనే వ్యక్తి ఏకంగా రూ.4,51,832లు పెట్టి సొంతం చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది.
రూ.4.51లక్షలు పెట్టటం కూడా పెద్ద విషయమేనా? అని అనుకోవచ్చు. కానీ.. ఇక్కడే ఉంది ట్విస్ట్ మరి. ఎందుకంటే.. రూ.4.51 లక్షలు పెట్టి కొన్న నెంబర్ ను ఉపయోగించనున్న వాహనం ధర రూ.2.5 లక్షలు మాత్రమే. 500 సీసీ బుల్లెట్ వాహనం కోసం అంతకు రెట్టింపు మొత్తాన్ని వెచ్చించి మరీ నెంబరును సొంతం చేసుకోవటం నిజంగా హాట్ వార్తే కదా..?