Begin typing your search above and press return to search.
ఏటీఎంకి వెళ్లి కక్కుర్తి పడ్డ యువకుడు
By: Tupaki Desk | 31 March 2020 6:30 PM GMTఎవరైనా ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకొస్తారు.. లేదా దొంగలైతే కొట్టుకొస్తారు.. కానీ ప్రస్తుత కరోనా టైంలో ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన శానిటైజర్ ను కొట్టేసిన వైనం వెలుగుచూసింది. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
ప్రస్తుతం కరోనా టైం దేశంలో నడుస్తోంది. శుభ్రత, పరిశుభ్రత పాటిస్తేనే జనాలకు కరోనా రాదు. ఈ నేపథ్యంలోనే జనాలు డెటాల్, లైఫ్ బాయ్ సబ్సులు, హ్యాండ్ వాష్ లు, శానిటైజర్స్ లు తెగ కొంటున్నారు. వాటికి డిమాండ్ పెరిగిపోవడం తో దొరకని పరిస్థితి నెలకొంది.
తాజాగా పాకిస్తాన్ లోని పెషావర్ లో నమక్ మండీ ప్రాంతంలో వింత చోటుచేసుకుంది. ఏటీఎంలోకి వెళ్లిన ఒక యువకుడు కస్టమర్ల కోసం బ్యాంకు ఏర్పాటు చేసిన శానిటైజర్ ను దొంగలించాడు.
డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లిన అతడు ముందుగా శానిటైజర్ ను చేతులకు పూసుకున్నాడు. ఆ తర్వాత డబ్బు డ్రా చేసుకున్నాడు. బయట శానిటైజర్ల కొరత నేపథ్యంలో ఎక్కువ ధర పలుకుతుండడం తో బ్యాంకు వారు పెట్టిన బాటిల్ ను ఎంచక్కా తన జేబులో పెట్టుకొని పరారయ్యాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ కావడంతో వైరల్ గా మారింది. మరీ ఇంత కక్కుర్తి పడ్డ యువకుడి తీరుపై విమర్శలు నెలకొన్నాయి.

Sanitizer stolen