Begin typing your search above and press return to search.
పైత్యం పీక్స్ కు..సరగసీ వద్దు..తనతో గడపాలన్నాడు
By: Tupaki Desk | 21 Feb 2020 5:45 AM GMTఅతడి వయసు 64 ఏళ్లు. అప్పటికే ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లి చేసి కాపురానికి పంపేశాడు. ఇలాంటి వయసులో తనకో వారసుడు ఉండాలని.. అందుకో మగబిడ్డ అవసరమని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా సరగసీ ప్రకారం అద్దెగర్భంలో మగబిడ్డను కనేలా ప్లాన్ చేశారు. అప్పటివరకూ సరిగా ఉన్న అతని ఆలోచనలు.. తర్వాత మారిపోవటమే కాదు.. అతడి పైత్యం చివరకు కటకటాలు పాలయ్యేలా చేసింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సూరప్పరాజుకు భార్య.. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పిల్లలందరికి పెళ్లిళ్లు అయిపోయాయి.
ఇలాంటివేళ.. తనకో కొడుకు ఉంటే బాగుంటుందని భావించాడు. సరగసీ పద్దతిలో బిడ్డను కనాలని భావించిన అతగాడు.. ఏజెంట్ సాయంతో ఒక మహిళతో సరగసీ పద్దతిలో మగ పిల్లాడ్ని కనేందుకు వీలుగా డీల్ కుదుర్చుకున్నాడు. అద్దె గర్భంలో పిండాన్ని మోసినందుకురూ.4.5 లక్షలతో పాటు.. డెలివరీ అయ్యే వరకూ నెలకు రూ.10 వేలు చొప్పున డబ్బులు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అందుకు ముంబయికి చెందిన భార్యభర్తలు ఓకే అని చెప్పి డీల్ కు అంగీకరించారు.
తాజాగా గుడికి వెళ్లిన వారు.. అద్దె గర్భానికే ఓకే చెప్పిన మహిళను తనతో పాటు ఇంటికితీసుకొచ్చాడు. ఆ సమయంలో భర్తకుపని ఉందని చెప్పి వెళ్లిపోవటంతో.. ఆమెతో మాటలు కలిపిన సూరప్పరాజు వికారపు ప్లాన్ ను తెర మీదకు తీసుకొచ్చాడు. సరగసీ పద్దతిలో కాకుండా నేరుగా పిల్లాడ్ని కందామని.. అందుకు తగ్గట్లు తనతో గడపాలన్నాడు. ఇందుకు అదనంగా రూ.50వేలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు.
దీనికి ఆమె నో చెప్పినా.. అదే పనిగా వేధింపులకు గురి చేయటంతో వారుపోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫిర్యాదును ప్రాథమికంగా విచారణ జరిపి.. సూరప్పరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరగసీ పద్దతిలో బిడ్డను కనేందుకు చట్ట ప్రకారం ఒప్పందం చేసుకున్నప్పటికీ.. వేధింపులకు గురి చేసిన అతడిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్లుగా పంజాగుట్ట పోలీసులు చెబుతున్నారు. లేటు వయసులో ఈ దరిద్రపు బుద్ధేమిటో?