Begin typing your search above and press return to search.

భార్యను గర్భవతిని చేయాలని పక్కింటి కుర్రాడితో డీల్..

By:  Tupaki Desk   |   21 Sep 2019 5:14 AM GMT
భార్యను గర్భవతిని చేయాలని పక్కింటి కుర్రాడితో డీల్..
X
ఊహకు అందని విషయాలు కొన్ని మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతుంటాయి. అసలు ఇలాంటి ఉదంతాలకు అవకాశం ఉందన్న భావన కూడా రానివి.. అనూహ్యంగా చోటు చేసుకోవటమే కాదు.. ఆయా విషయాలకు సంబంధించిన అప్డేట్స్ వింటే.. వామ్మో అనుకోకుండా ఉండలేమంతే. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా అలాంటిదే. నమ్మశక్యం కాని ఈ వ్యవహారం ఎక్కడ చోటు చేసుకుందంటే..

అనగనగా జర్మనీ. యూరప్ లోని ప్రముఖ దేశమైన ఈ దేశ ప్రజలు సంప్రదాయవాదులుగా పేరుంది. అలాంటి దేశంలో ఒక పెద్ద మనిషికి చిత్రమైన ఆలోచన వచ్చింది. అదేమంటే.. తానెంత ప్రయత్నించినా భార్యను ప్రెగ్రెంట్ చేయలేకపోవటంతో.. తన పక్కింటి కుర్రాడైన జోస్ తో ఒక ఒప్పందం చేసుకున్నాడు.

దీని ప్రకారం.. ఆర్నెల్లలో తన భార్యను గర్భవతిని చేయాలని.. అందుకోసం 2500 యూరోలు (మన రూపాయిల్లో అయితే దగ్గర దగ్గర రూ.2లక్షలకు కాస్త తక్కువ) ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకొని డబ్బు ఇచ్చాడు. అయితే.. కాంట్రాక్టులో భాగంగా ఆర్నెల్లు గడిచినా అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా తన భార్య గర్భవతి కాకపోవటాన్ని డానీ ప్రశ్నించాడు. దీంతో.. జోస్ ను వైద్యుల దగ్గరకు తీసుకెళ్లి పరీక్షలు జరిపారు. అయితే.. అతడి ద్వారా పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చారు వైద్యులు.

దీంతో.. తమను మోసం చేశారంటూ డానీ.. సదరు కుర్రాడిపై కోర్టుకు వెళ్లాడు. ఈ సందర్భంగా జోస్ వాదనలు వినిపిస్తూ.. తన ప్రయత్నం తాను చేశానని.. ఆర్నెల్ల వ్యవధిలో 72 సార్లు ప్రయత్నించినా గర్భం దాల్చకపోవటంలో తన తప్పు లేదని.. తానెంతో ప్రయత్నించినా ఫలితం లేకపోవటంలో తన తప్పేముందని వాదించాడు. అంతే కాదు.. ఒప్పందంలో భాగంగా తనకిచ్చిన 2500 యూరోలు తిరిగి ఇచ్చేది లేదని తేల్చేశాడు.

దీనిపై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది? ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయినా.. ఇలాంటి దరిద్రపుగొట్టు ఒప్పందాలు చేసుకునే ముందు.. ఒప్పందం చేసుకునే కుర్రాడికి గర్భం చేయగల శక్తి ఉందా? లేదా? అన్న విషయాన్ని ఎందుకు క్రాస్ చెక్ చేసుకోలేదో? ఏమైనా.. మన ఊహకు అందని ఈ తరహా ఒప్పందాలు విన్నంతనే అవాక్కు అవ్వటం ఖాయం.