Begin typing your search above and press return to search.

ఒక‌టి గాయ‌ప‌రిస్తే... రెండోది ప్రాణం తీసేసింది!

By:  Tupaki Desk   |   6 Jan 2017 8:56 AM GMT
ఒక‌టి గాయ‌ప‌రిస్తే... రెండోది ప్రాణం తీసేసింది!
X
న‌ర‌లోకాధిప‌తి య‌మధ‌ర్మ‌రాజు లెక్క నుంచి త‌ప్పించుకోవడం క‌ష్ట‌మే సుమా. ఎందుకంటే.. మాన‌వుడి పాప పుణ్యాల‌ను లెక్కించే య‌ముడు... మ‌న ప్రాణాన్ని ఎప్పుడు తీయాలో నిర్ణ‌యిస్తే... ఆ లెక్క త‌ప్ప‌దు కాక త‌ప్ప‌దు. ఆ ఘ‌డియ వ‌చ్చిందంటే... ఎన్ని ప్లాన్లు వేసినా త‌ప్పించుకోలేం. అంతేకాదండోయ్‌... య‌ముడు నిర్ణ‌యించిన ఘ‌డియ‌కు కాస్త ముందుగా చ‌నిపోదామ‌న్నా కుద‌ర‌దు. అదెలా అంటే... అదంతే. ఇదేంటీ... సినిమా క‌థ చెబుతున్నాం అనుకుంటున్నారా? ఎంత‌మాత్రం కాదు. రియ‌ల్ లైఫ్‌ లో జ‌రిగిన య‌దార్ఘ ఘ‌ట‌న‌. దుబాయిలో మొన్న (బుధ‌వారం) సాయం సంధ్య వేళ స‌రిగ్గా 4 గంట‌ల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌నలో ఓ వ్య‌క్తిని వెతుక్కుంటూ చావు వ‌చ్చేసింది. అయితే ఆ ఘ‌డియ‌కు కాస్తంత ముందుగా జ‌రిగిన ప్ర‌మాదంలో ఆ వ్య‌క్తి తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. అయినా చ‌నిపోలేదు. ఈలోగా జ‌నం అక్క‌డికొచ్చి... ర‌క్త గాయాల‌తో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ఆ వ్య‌క్తిని రోడ్డు ప‌క్క‌గా కూర్చోబెట్టారు. ఈలోగా ఎవ‌రో అంబులెన్స్‌ కు ఫోన్ కూడా చేశారు. అంబులెన్స్ వ‌చ్చేంత‌వ‌ర‌కు అత‌డిని ఓ క‌రెంట్ పోల్ కు ఆనించేసిన అక్క‌డి వారు... ఫ‌స్ట్ ఎయిడ్ కూడా చేసేస్తున్నారు. ఈ లోగా య‌ముడు పంపిన చావు...కారు రూపంలో వేగంగా దూసుకువ‌చ్చింది. అంతే అత‌డి ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి.

వివ‌రాల్లోకెళితే... యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌ కు చెందిన ఓ వ్య‌క్తి దుబాయిలో కారులో వెళుతుండ‌గా... ఓ ట్ర‌క్కు వ‌చ్చి అత‌డి కారును ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆ వ్య‌క్తికి తీవ్ర గాయాల‌య్యాయి. కానీ ప్రాణాల‌తోనే బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ ప్ర‌మాదాన్ని గ‌మ‌నించిన స్థానికులు - పోలీసులు హుటాహుటిన అక్క‌డికి చేరుకుని అత‌డిని కారులో నుంచి బ‌య‌ట‌కు లాగేశారు. ర‌క్తంతో అతడి శ‌రీరం త‌డిసిపోగా... అత్య‌వ‌స‌ర చికిత్స అందిస్తే గాని బ్రతికే ఛాన్సు లేన‌ట్టుంది అత‌డి ప‌రిస్థితి. వెనువెంట‌నే అంబులెన్స్‌కు ఫోన్ చేసిన అక్క‌డి వారు.... అత‌డిని న‌డి రోడ్డు మ‌ధ్య నుంచి ఫుట్ పాత్‌ పైకి చేర్చారు. కూర్చోలేని స్థితిలో ఉన్న అతడిని ఓ క‌రెంట్ పోల్‌ కు ఆనించి అంబులెన్స్ కోసం ఎదురు చూడ‌సాగారు. ఈ లోగా ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలియ‌దు కాని... ఓ కారు జెట్ స్పీడుతో దూసుకువ‌చ్చింది. వేగంగా దూసుకువ‌స్తున్న కారును చూసిన వారు ప‌క్క‌కు త‌ప్పుకోగా... 10 నిమిషాల క్రితం జ‌రిగిన ప్ర‌మాదంలో తీవ్ర గాయాల‌పాలై క‌రెంట్ పోల్‌ ను ఆస‌రా చేసుకుని కూర్చున్న బాధితుడు మాత్రం ప‌క్క‌కు క‌ద‌ల‌లేక‌పోయాడు. దీంతో ఆ కారు అత‌డిని గుద్దేసింది. అత‌డి ప్రాణాల‌ను తీసేసింది. అంటే కేవ‌లం 10 నిమిషాల వ్య‌వ‌ధిలో జ‌రిగిన రెండు ప్ర‌మాదాల్లో... ఓ ప్ర‌మాదం అత‌డిని గాయాల‌పాల్జేయ‌గా, ఇంకో ప్ర‌మాదం అత‌డి ప్రాణాల‌నే తీసేసింది. స‌ద‌రు దుర‌దృష్టవంతుడి పేరు, వివ‌రాలు మాత్రం వెల్ల‌డి కాలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/