Begin typing your search above and press return to search.

అన్న‌పూర్ణ స్టూడియోలో అనుమానాస్ప‌ద మృతి

By:  Tupaki Desk   |   31 May 2018 9:53 AM GMT
అన్న‌పూర్ణ స్టూడియోలో అనుమానాస్ప‌ద మృతి
X
అన్న‌పూర్ణ స్టూడియో మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కింది. స్టూడియోలో ప‌ని చేసే 53 ఏళ్ల నారాయ‌ణ రెడ్డి అనే వ్య‌క్తి అనుమానాస్ప‌ద రీతిలో మ‌ర‌ణించ‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. స్టూడియో సిబ్బంది గుట్టు చ‌ప్పుడు కాకుండా మ‌ర‌ణించిన వ్య‌క్తి మృత‌దేహాన్ని త‌ర‌లించ‌టం.. మ‌ర‌ణించిన స‌మాచారాన్ని మృతుడి బంధువుల‌కు సైతం స‌మాచారం ఇవ్వ‌క‌పోటం ఏమిట‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో మృతుడి బంధువులు ఆందోళ‌న‌కు దిగారు. స్టూడియోలో మ‌ర‌ణించిన నారాయ‌ణ‌రెడ్డి మృత‌దేహాన్ని ప్ర‌స్తుతం ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దీంతో.. ఆసుప‌త్రి ఎదురుగా మృతుడి బంధువులు ఆందోళ‌న చేప‌ట్టారు.ఇదిలా ఉండ‌గా.. స్టూడియోలో మృతి చెందిన స‌మాచారాన్ని అందుకున్న పోలీసులు జూబ్లీహిల్స్ లోని అన్న‌పూర్ణ స్టూడియోకి వెళ్లారు. అక్క‌డ వివ‌రాలు సేక‌రిస్తున్నారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని మృతుడి కుటుంబ స‌భ్యులు.. బంధువులు డిమాండ్ చేస్తున్నారు.