Begin typing your search above and press return to search.
గుండె పిండేసిన ఆ కుక్క బతికింది..
By: Tupaki Desk | 6 July 2016 9:49 AM GMTఒక కుక్క కథ ప్రస్తుతం సౌత్ ఇండియా అంతటా చర్చనీయాంశమవుతోంది. ఆ కుక్క దైన్యాన్ని చూసి వేలమంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కుక్క బతికిందని తెలిసి ఆనంద భాష్పాలు రాల్చారు. ఆ కుక్కను హింసకు గురి చేసి పైశాచిక ఆనందాన్ని పొందిన ఇద్దరు కుర్రాళ్లు బయటెక్కడైనా కనిపిస్తే జనాలు పట్టుకుని తన్నే పరిస్థితి ఉంది. ఇంతకీ ఏంటా కుక్క కథ.. తెలసుకుందాం పదండి.
రెండు రోజుల కిందట ట్విట్టర్.. ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో హల్ చల్ చేసింది. అందులో ఓ వ్యక్తి ఓ పెద్ద బిల్డింగ్ మీద గోడ మీద కుక్కను పట్టుకుని నిలబడ్డాడు. ఇవతల ఇంకో వ్యక్తి అతడిని వీడియో తీస్తున్నాడు. కుక్క మెడ దగ్గర.. వెనుకవైపు పట్టుకుని అమాంతం పైకెత్తిన ఆ వ్యక్తి దాన్ని కిందికి విసిరేశాడు. రెండు మూడు అంతస్తుల మేడ పైనుంచి పొదలాగా ఉన్న అవతలి వైపు కుక్క పడిపోయింది. పాపం తనతో ఆడుతున్న ఆ వికృత క్రీడ గురించి తెలియక గాల్లో ప్రయాణిస్తుండగా ఆ కుక్క తోక ఊపడం.. కింద పడి కొట్టుకోవడం చూసిన వాళ్లకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ వికృత క్రీడ ఆడిన ఇద్దరు వ్యక్తుల మీద సోషల్ మీడియాలో జనాలు యుద్ధం ప్రకటించారు. కేవలం జంతు ప్రేమికులే కాదు.. ఆ వీడియోను ఎవ్వరు చూసినా హృదయం ద్రవించక మానదు. ఈ కుక్కకు సంబంధించిన వీడియో గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరగడం గమనార్హం. కొన్ని అంతర్జాతీయ వెబ్ సైట్లు సైతం ఈ వీడియో గురించి వార్తలు వేశాయి.
ఈ వీడియోను షేర్ చేసి ఆ వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు. ముగ్గురు వాలంటీర్లు చివరికి వాళ్లెవ్వరో కనుక్కున్నారు. కుక్కను విసిరిన వ్యక్తి ఓ మెడికల్ స్టూడెంట్ కావడం గమనార్హం. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆ స్టూడెంటుని ఎంబీబీఎస్ చదవడానికి అనర్హుడిగా ప్రకటించాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. అతడికి శిక్ష పడాలని కూడా అంటున్నారు. ఐతే మన చట్టాల ప్రకారం ఇలాంటి పనులకు శిక్షలు పడే అవకాశం లేదు. ఐతే ఈ ఎపిసోడ్లో ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. ఆ కుక్క చనిపోలేదు. దాని కాలు మాత్రం విరిగింది. కొందరు వలంటీర్లు దాన్ని చేరదీసి.. చికిత్స చేయించి భద్రంగా చూసుకుంటున్నారు.