Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో మోడల్ అసభ్య వీడియోలు..5లక్షలకు బేరం

By:  Tupaki Desk   |   21 Sep 2019 7:45 AM GMT
సోషల్ మీడియాలో మోడల్ అసభ్య వీడియోలు..5లక్షలకు బేరం
X
ముంబైలో ఆమె టాప్ మోడల్.. స్నేహితుడి ద్వారా పరిచయం అయిన దుబాయ్ లో ఉంటున్న వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ముంబైలో కలుసుకుంది. పరిచయం మాటలతో ఆగలేదు. ప్రేమ వరకూ వెళ్లింది. ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని దుబాయ్ వాసి ముంబై మోడల్ ను నమ్మించాడు.. అనంతరం నగ్న వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేశాడు..

దుబాయ్ వ్యక్తి ప్రేమిస్తానని.. పెళ్లి చేసుకుంటానని వీడియో చాట్ లో అడగడంతో ముంబై మోడల్ కరిగిపోయింది. అతడి ప్రేమకు ఓకే చెప్పింది. దీంతో వీరి ప్రేమ ఆన్ లైన్ వీడియోలతో చాటింగ్ లతో కొద్దిరోజులు సాగింది.

మోడల్ ను మెల్లిగా లైన్లో పెట్టిన దుబాయ్ వాసి కాబోయే భర్తకు నీ నగ్నత్వం చూపించవా అంటూ బతిమిలాడాడు. ముందు నో చెప్పిన మోడల్.. చివరకు అతడి అలకకు కరిగి ఓకే చెప్పింది. భవిష్యత్ లో భర్తే కదా అని న్యూడ్ గా ఉంటూ చాట్ చేసింది. తన న్యూడ్ వీడియోలను అతడికి పంపింది.

అయితే దుర్భిద్ది గల దుబాయ్ లో ఉంటున్న వ్యక్తి తన అసలు రంగు బయటపెట్టాడు. న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్ అయ్యి మోడల్ స్నేహితుడికి చేరింది. అతడు మోడల్ కు వీడియోలు చూపించడంతో ఆమె ఖంగుతిన్నది. వెంటనే దుబాయ్ వ్యక్తికి ఫోన్ చేయగా.. తనకు రూ.5 లక్షలు ఇస్తేనే ఆ వీడియోలు తీసేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మోడల్ ముంబై పోలీసులను ఆశ్రయించింది. తమ ఇంట్లోని కుటుంబ సభ్యులకు తెలియకుండా విచారణ జరపాలని కోరింది. పోలీసులు ఇప్పుడు దుబాయ్ బాబు కోసం విచారణ మొదలుపెట్టారు.