Begin typing your search above and press return to search.

రైల్వేకి పంచ్ వేశాడు..అడ్డంగా బుక్ అయ్యాడు

By:  Tupaki Desk   |   30 May 2019 6:00 AM GMT
రైల్వేకి పంచ్ వేశాడు..అడ్డంగా బుక్ అయ్యాడు
X
రైల్వేస్ కు పంచ్ వేసే ప్ర‌య‌త్నం చేసిన ఒక యువ‌కుడు ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో చిక్కుకున్నాడు. ఒక వేలు చూపిస్తే.. నాలుగు వేళ్లు మ‌న‌వైపు చూపిస్తాయ‌న్న చిన్న విష‌యాన్ని మిస్ అయిన అత‌గాడు.. తాజాగా అడ్డంగా బుక్ అయ్యాడు. పంచ్ కు రివ‌ర్స్ పంచ్ త‌ర్వాత‌.. ప‌రువు పోగొట్టుకున్న అత‌గాడు నోట మాట రాకుండా ఉండే చేజేతులారా కొని తెచ్చుకున్నాడు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

ఒక యువ‌కుడు ఐఆర్ సీటీ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటున్నాడు. అయితే.. అత‌డి కంప్యూట‌ర్ స్క్రీన్ మీద అర్థ‌న‌గ్నం బొమ్మ‌ల‌తోపాటు.. మ‌హిళ‌ల లోదుస్తుల‌కు సంబంధించిన యాడ్ వ‌చ్చింది. దీనిపై అత‌గాడు అభ్యంత‌రం చేస్తూ రైల్వే శాఖామంత్రికి ట్వీట్ చేశారు. తాను టికెట్ కొనుగోలు చేసేందుకు సైట్ ఓపెన్ చేస్తే ఎదురైన ఇబ్బందికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేసి.. ఘాటు వ్యాఖ్య ఒక‌టి చేశారు.

ఇలాంటి యాడ్స్ కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్న‌ట్లుగా చెబుతూ.. దీనిపై వివ‌ర‌ణ‌ కోరాడు. అయితే.. స‌ద‌రు యువ‌కుడు ఏ మాత్రం ఊహించ‌ని రీతిలో ఐఆర్ సీటీసీ నుంచి స‌మాధానం వ‌చ్చింది. అత‌గాడి ట్వీట్ పంచ్ కు.. దిమ్మ తిరిగే లా బ‌దులిచ్చింది. తాము గూగుల్ యాడ్స్ వినియోగిస్తామ‌ని.. స‌ద‌రు సాఫ్ట్ వేర్.. వినియోగ‌దారుడి కంప్యూట‌ర్ గ‌తంలో బ్రౌజ్ చేసే వెబ్ సైట్ల ఆధారంగా.. వారి అభిరుచికి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ల్ని చూపిస్తాయ‌ని పేర్కొన్నారు. ద‌య‌చేసి మీ కంప్యూట‌ర్లో ఉన్న కుకీస్ ను డిలీట్ చేసిన త‌ర్వాత యాప్ ఓపెన్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న ట్వీట్ తో ఇండియ‌న్ రైల్వేకు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి తెచ్చే ప్ర‌య‌త్నంలో స‌ద‌రు యువ‌కుడు దారుణ‌మైన ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొన్నార‌ని చెప్పాలి. అందుకే అంటారు.. డిజిట‌ల్ ప్ర‌పంచంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. మనం చూసే ప్ర‌తిది ఎక్క‌డో ఒక చోట రికార్డు అవుతూ ఉంటుంది. ఆ విష‌యం మీద అవ‌గాహ‌న లేక.. ఇబ్బందిక‌ర ప‌రిస్థితి స‌ద‌రు యువ‌కుడికి ఎదురైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. సో.. బీకేర్ ఫుల్.