Begin typing your search above and press return to search.
పెళ్లికాని ప్రసాద్ ల బాధ ఇదీ.!
By: Tupaki Desk | 9 Dec 2019 1:30 AM GMT35 ఏళ్లు దాటుతున్నాయి.. అయినా పెళ్లి కావడం లేదు. పిల్ల దొరకడం లేదు. జీవితంలో స్థిరపడాలని కష్టపడి చదివి.. ఉద్యోగం కొట్టి నాలుగు రాళ్లు సంపాదించేసరికి ముప్పావు జీవితం గడిచిపోతోంది. పెళ్లికి దూరంగా ఉండి అన్ని సాధించాక చేసుకోవడానికి అమ్మాయి దొరకని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దేశంలోనే బాలిక నిష్పత్తి ఘననీయంగా తగ్గిపోతోంది. ఆడపిల్లలకు డిమాండ్ పెరిగిపోయింది. దేశంలో 1000 మంది బాలురకు 920 మంది మాత్రమే సగటున బాలికలున్నారట.. ప్రస్తుతం పిల్లల సంఖ్య చూస్తే ఇంకా దారుణంగా పడిపోయిందట.. అందుకే ఇప్పుడు ఆడపిల్లలకు డిమాండ్ పెరిగిపోయింది. మ్యారేజ్ బ్యూరోలకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. మా అబ్బాయికి పిల్లనివ్వండి అంటూ తల్లిదండ్రులు తిరిగే పరిస్థితులు సమాజంలో కనిపిస్తున్నాయి.
* జీవితంలో స్థిరపడే సరికి వయసు కరిగిపోతోంది..
మగాళ్లకు పెళ్లి కాకపోవడానికి ప్రధాన కారణం స్థిరపడకపోవడమే... చదువు, ఉద్యోగం, తరువాత పెళ్ల్లి చేసుకోవడానికి యువకులు సిద్ధపడుతున్నారు. అయితే ఆర్థికంగా స్థిరపడే క్రమంలో వయసు మీదపడుతోంది. స్థిరపడ్డాక చేసుకుందామంటే పిల్ల దొరకని పరిస్థితి నెలకొంది. ఆర్థికంగా స్థిరపడితేనే చక్కని జీవితాన్ని కొనసాగించవచ్చని యువకులు భావిస్తే.. అదే క్రమంలో యువతులు కూడా చక్కని ఉద్యోగం చేసే భర్త కావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే జీవితంలో స్థిరపడాలనే తపన పెరిగిపోతోంది. అందులో భాగంగానే వయస్సు కరిగిపోతోంది. యువకులు వధువుల కోసం వెతుకులాడే పరిస్థితి సమాజంలో పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా ఎక్కడైనా ఆడపిల్ల ఉంటే చెప్పండి మా వాడు బెంగుళూర్, ముంబై, పుణాలలో సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తున్నా డని తల్లిదండ్రులు అడుగుతున్న తీరు కనిపిస్తోంది. గతంలో ఉన్న పట్టింపులను కూడా మరిచి రాశి - నక్షత్రం - గోత్రం మేం పట్టించుకోమని అమ్మాయి బాగుంటే చాలని అడుగుతున్న వారు కనిపిస్తున్నారు.
*పిల్ల, కట్నం రెండూ కష్టమే..
మరోవైపు సంపాదన లో ఉన్న యువకులు మరో సంపాదించే అమ్మాయే భార్య గా రావాలని కోరుకుంటున్నారు. దీంతో అందమైన పిల్ల, ముల్లె రెండు ఒక చోట లభించక కూడా పెళ్లి సంబంధా లు కుదరడం లేదు. ఈ క్రమంలోనే వయస్సు కాస్తా దాటిపోతోంది. గతంలో 18ఏళ్లలోపే ఏ పనిచేసినా చేయ కపోయినా పెద్దలు వివాహాలు జరిపించే వారు. ఇప్పుడు మారుతున్న కాలంలో ఉన్నత చదువులు - ఆర్థికంగా స్థిరపడిన తరువాతే వివాహం చేసుకోవాలని భావిస్తు న్నారు. దీంతో 40ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కాకపోవడం కనిపిస్తోంది. చివరకు ఎవరైనా సరే అనుకున్నప్పటికి అమ్మాయిలు మాత్రం దొరకని పరిస్థితి నెలకొంది. కట్నకానుకలు పట్టింపులేదని అబ్బాయిలు ముందుకు వస్తున్నారు.
*వ్యాపారాలు చేసే వారికి పిల్లనివ్వడం లేదు..
ఇక కొందరు యువకులు వ్యాపార రంగంలో రాణిస్తున్నా వారికి పెళ్లిళ్లు కావడం లేదు. ఉద్యోగాలు చేసే వారే కావాలని పిల్ల తల్లిదండ్రులు చూస్తుండడంతో వ్యాపార రంగంలో ఉన్న యువకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ‘పెళ్లి కాని ప్రసాద్’ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇక మరో కారణం అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడమేనని లెక్కలు చెబుతున్నాయి. యువ కులతో పోల్చుకుంటే యువతుల సంఖ్య తక్కువగా ఉండ డంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే మ్యారేజ్ బ్యూరోలు కూడా పెరిగిపోతున్నాయి.
* లేట్ మ్యారేజ్‌లతో ఇబ్బందులు..
వయసు దాటిన తరువాత వివాహాలు చేసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు కలుగకపోవడం ఒకవైపు జరిగితే - పిల్లలు కలిగినా వారు స్థిరపడక ముందే వీరు వృద్ధాప్యం లోకి వెళ్లిపోవడం వంటి సమస్యలు మొదలవుతున్నాయి. ఇప్పుడు పిల్లలకు పెళ్లిళ్లు చేయడమే తల్లిదండ్రులకు ఓ సవాల్‌గా మారుతోంది.