Begin typing your search above and press return to search.
సీఎం జగన్ బొమ్మపై రంగు పూసినోడిపై కేసు
By: Tupaki Desk | 2 Oct 2019 5:45 AM GMTఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అగౌరవపర్చేలా.. ఆయన ప్రతిష్ఠ దిగజార్చేలా విపక్షం చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు. ఇందులో భాగంగా అభ్యంతరకర రీతిలో వ్యవహరిస్తున్న వారిపై ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో జగన్ బొమ్మపై రంగు పూసి.. అవమానించే ప్రయత్నం చేసిన వ్యక్తికి తగిన శాస్తి జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెద రాయవరం గ్రామ సచివాలయంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బొమ్మ ఉంది. ఈ బొమ్మకు రంగు పులమటం ద్వారా అగౌరవించే ప్రయత్నం చేశాడు అదే గ్రామానికి చెందిన కొట్టు సూరిబాబు. దీనిపై అందిన ఫిర్యాదు ఆధారంగా సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రాధమిక ఆధారాల్ని సేకరించిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.