Begin typing your search above and press return to search.
షాకింగ్ః మగతనం కోసం 121 ఆపరేషన్లు
By: Tupaki Desk | 5 Jun 2016 3:35 PM GMTఅవసరం ఆవిష్కరణలను తెరమీదకు తెస్తుంది. ఆలోచన దాన్ని పీక్ స్టేజీకి తీసుకువెళ్తుంది. ఇపుడు అదే జరుగుతోంది. రకరకాల అంగాల మార్పిడిలో భాగంగా ఇపుడు పురుషాంగం మార్పిడి ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. ఇదుగో ఈ కేసు అలాంటిదే. ఈయన గారు మగతనం కోసం ఆపరేషన్ మాత్రమే చేసుకోలేదు. అలా 121 సార్లు ఆపరేషన్లు చేయించుకొని తన కోరికను నెరవేర్చుకున్నాడు.
బ్రిటన్ లోని ఎడిన్ బర్డ్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మొహమ్మద్ అబాద్(44) ఈ ప్రయోగానికి సిద్ధపడ్డారు. ఆరేళ్ల వయసులో కారు ఆక్సిడెంట్ లో ఆయన శరీరం దాదాపు అరకిలోమీటర్ ఈడ్చుకుపోవడం వల్ల పురుషాంగాన్ని కోల్పోయాడు. పురుషాంగంతో పాటు ఒక వృషణాన్ని కోల్పోయినప్పటికీ ఎలాగోలా ఆయన్ను బతికించగలిగారు. ఇక అప్పటి నుంచి ఆయన బాధలు వర్ణణాతీతం. కూర్చొని మాత్రమే మూత్రవిసర్జన చేయడం - తోటి విద్యార్థుల వేధింపులు ఇలా ఎన్నో కష్టాలు. అయితే అలా జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చి లండన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించుకున్నాడు. ఇలా దాదాపు వందకుపైగా శస్త్రచికిత్సలతో కృతనిశ్చయంతో పురుషాంగాన్ని పొందాడు. ఎట్టకేలకు 2012లో అబాద్ చివరి ఆపరేషన్ పూర్తయింది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్
తన కోరిక పూర్తిగా నెరవేరి పురుషాంగం సరికాకముందే ఓ మహిళను వివాహం చేసుకోవడం, ఆమె అబాద్ నిజస్వరూపాన్ని తెలుసుకొని మొదటిరాత్రి వెళ్లిపోవడం జరిగిపోయింది. దీంతో తీవ్రంగా కలత చెందిన అబాద్ ఓ సెక్స్ వర్కర్ తో కలవగా ఆ ప్రక్రియలో తీవ్ర అవస్థ ఎదురయింది. ఆయన పురుషాంగం పొడవు ఎక్కువగా ఉందని తేలింది. దీంతో తిరిగి అదే ఆసుపత్రిలో 120 - 121వ ఆపరేషన్లకు సిద్ధపడ్డారు. దీనికోసం ఆయన ఇప్పటికే దాదాపు 70 లక్షలు ఖర్చుచేశాడు.
ఇదిలా ఉంటే కృత్రిమ పురుషాంగం పనిచేసే తీరు ఆసక్తికరం. రసాయన ద్రావణాలు నింపిన రెండు ట్యూబ్ లను ఒక్కటిగా చేర్చి - శరీరంలో మరో ప్రదేశం నుంచి సేకరించిన కొవ్వు - చర్మాన్ని ఆ ట్యూబ్ లకు అతికిస్తారు. 2-3 అంగుళాలుండే మరో గుండ్రటి ట్యూబ్ లో అంగస్తంభనకు ఉపకరించే జీవపదార్థాలు - రసాయనాలను నింపి కడుపులో ఉంచుతారు. దాని నుంచి ఓ సన్నటి పైప్ ను పురుషాంగానికి కనెక్ట్ చేస్తారు. అవసరం అనుకున్నప్పుడు ఆన్ - ఆఫ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు అబాద్ కు చేయబోయే ఆపరేషన్ ద్వారా వీర్యకణాలు (మిగిలిన ఒక వృషణంలో తయారైనవి) సులువుగా వెలుపలికి వచ్చే వీలుంటుంది.