Begin typing your search above and press return to search.

బాలికను సెక్స్ కోసం వేధించాడు..565 కి.మీ. నడిచి బుక్ అయ్యాడు

By:  Tupaki Desk   |   16 Oct 2019 7:06 AM GMT
బాలికను సెక్స్ కోసం వేధించాడు..565 కి.మీ. నడిచి బుక్ అయ్యాడు
X
వేదిక ఏదైనా కావొచ్చు సెక్స్ కోసం పడే పాట్లు అన్ని ఇన్ని కావు. పరస్పర అంగీకారంతో ఎంజాయ్ చేయటం ఒక పద్దతి. అందుకు భిన్నంగా ఏదో ఒక విషయాన్ని పట్టుకొని.. దాన్ని సాకుగా చూపిస్తూ సెక్స్ కోసం వేధింపులకు గురి చేసేవారెందరో. ఆఫ్ లైన్ లోనే కాదు.. ఆన్ లైన్ లోనూ ఇలాంటి వేధింపులు తప్పట్లేదు. స్నేహం ముసుగుతో మొదలయ్యే ఈ వ్యవహారంలో పూర్తిగా నమ్మిన వారికి కొత్త తిప్పలు ఖాయం. తాజాగా ఒక మైనర్ బాలికకు ఎదురైన చేదు అనుభవంలో చివర్లో ట్విస్ట్ షాకింగ్ గా మారింది.

ఇలాంటివి చేయటం ద్వారా సెక్స్ వ్యసనపరులు.. బ్లాక్ మెయిలర్ల ఆట కట్టించే వీలుంది. ఇంతకూ జరిగిందేమంటే.. ఫేస్ బుక్ ద్వారా ఇండియానాకు చెందిన ఒక వ్యక్తి (జెంక్విన్స్) విస్కాన్సిన్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలికతో స్నేహం స్టార్ట్ చేశాడు. కొద్ది రోజుల తర్వాత నుంచి బాలిక న్యూడ్ ఫోటోలు పంపాలని టార్చర్ చేసేవాడు. దీంతో.. తనను కలవాల్సిందిగా సదరు బాలిక కోరింది.

ఇతడు ఉన్న ప్రాంతం నుంచి బాలిక ఉన్న ప్రాంతానికి మధ్య దూరం 565కి.మీ. కలవమని చెప్పిన నేపథ్యంలో ప్రయాణం స్టార్ట్ చేశాడు. మార్గమధ్యలో తాను వస్తున్న ప్రాంతాలకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేశాడు. కోటి కలలు కంటూ విస్కాన్సిన్ ప్రాంతానికి చేరుకున్నాడు. బాలిక చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు.

అంతే.. పోలీసులు పెద్ద ఎత్తున వచ్చేసి అతడ్ని అదుపులోకి తీసుకోవటంతో బిత్తరపోయాడు. ఈ ఉదంతంలో ట్విస్ట్ ఏమంటే మైనర్ బాలిక అస్సలు లేదు. ఆన్ లైన్ లో సెక్స్ వేధింపులకు కళ్లెం వేసేందుకు పోలీసులే బాలిక పేరుతో డూప్లికేట్ అకౌంట్ ఓపెన్ చేసి.. పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపటం ద్వారా దుర్మార్గులకు వల వేసేవారు. ఇలా దొరికినోడే జెంక్విన్స్. మైనర్ బాలికతో సెక్స్ కోసం తపించి.. టార్చర్ పెట్టిన అతగాడు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు.