Begin typing your search above and press return to search.
ఆగిన శ్వాస; మునికోటి మరణించాడు
By: Tupaki Desk | 9 Aug 2015 8:50 AM GMTమండిన గుండె మూగపోయింది. కోట్లాది మంది కోసం తనను తాను ఆర్పించేందుకు సిద్ధమైన మునికోటి మరణించాడు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రం అనుసరిస్తున్న వైఖరి.. రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుతో ఒళ్లు మండిన తిరుపతికి చెందిన మునికోటి.. తన శరీరానికి నిప్పు అంటించుకోవటం..తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరటం తెలిసిందే.
సంచలనం సృష్టించిన మునికోటి ఆత్మాహుతి ఆత్మహత్య యత్నం.. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఆయన్ను కాపాడలేకపోయారు. ఒంటిమీద కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్న ఘటనలో 70 శాతం కంటే అధికంగా శరీరం కాలిపోవటంతో అతని పరిస్థితి విషమంగా ఉండటం.. దీంతో తిరుపతి రుయా నుంచి మెరుగైన వైద్యం కోసం తమిళనాడు వేలూరులోని సీఎంసీకి తరలించటం తెలిసిందే.
చివరి కంటా ప్రయత్నించిన వైద్యుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం మునికోటి మరణించినట్లుగా అధికారికంగా ప్రకటించారు. కుటిల రాజకీయాల కారణంగా..ఏపీకి ప్రత్యేక హోదా కోసం తహతహలాడిన ఒక నిండు ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది.