Begin typing your search above and press return to search.
కూచిబొట్ల హంతకుడికి 50 ఏళ్ల జైలు
By: Tupaki Desk | 7 March 2018 1:37 PM GMTఅమెరికా న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. అమెరికాలోని కన్సాస్‌లో భారత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌ను కాల్చి చంపిన కేసులో నిందితుడు ఆడమ్ ప్యూరింటన్‌కు 50 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసులో తాను నేరం చేసినట్లు ప్యూరింటన్ అంగీకరించాడు. శ్రీనివాస్‌ను హత్య చేయడంతోపాటు అతని స్నేహితుడు అలోక్ మాదసాని, తనను అడ్డుకున్న ఇయాన్ గ్రిలాట్ లపై కూడా ప్యూరింటన్ కాల్పులు జరిపాడు. తానీ హత్య చేసినట్లు జడ్జి ముందు అతడు అంగీకరించాడు. ప్యూరింటన్‌కు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. 50 ఏళ్ల వరకు పెరోల్ తీసుకునే అవకాశం కూడా ఉండదు.
2017, ఫిబ్రవరి 22న ఈ ఘటన జరిగింది. వాళ్లపై కాల్పులు జరిపే ముందు మా దేశం నుంచి వెళ్లిపోండి అని ప్యూరింటన్ అరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతను నేరం అంగీకరించిన సమయంలో కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయన కోర్టులో లేరు. ఆ తర్వాత దీనిపై స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆమె ఆకాంక్షించారు. శ్రీనివాస్ హత్య తర్వాత సునయన.. ఇమ్మిగ్రేషన్ సంబంధిత అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఓ ఫేస్‌బుక్ పేజ్ స్టార్ట్ చేశారు. ఈ మధ్యే ట్రంప్ తొలి స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగ కార్యక్రమానికి కూడా ఆమె హాజరయ్యారు.
ఇదిలాఉండగా...ఈ ఘటనలో గాయపడిన అలోక్ మాదసాని ఆ రోజు జరిగిన ఘటనను కోర్టుకు వివరించారు. కాల్పులు జరిపే ముందు ఒకసారి తమ దగ్గరికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడి వెళ్లిపోయాడని అలోక్ చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే గన్ తీసుకొని వచ్చి కాల్పులు జరిపాడని తెలిపారు. ఈ ఘటనలో కూచిభొట్ల శ్రీనివాస్ కు మూడు బుల్లెట్ గాయాలు కాగా.. అతను అక్కడికక్కడే మరణించాడు. అలోక్ కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వాళ్లను కాపాడే ప్రయత్నం చేసిన ఇయాన్ గ్రిలాట్‌కు చేయి, ఛాతీల్లో బుల్లెట్ గాయాలయ్యాయి.