Begin typing your search above and press return to search.
వీడెంత శాడిస్ట్ లవ్వరంటే..?
By: Tupaki Desk | 30 April 2016 5:30 PM GMTప్రేమించిన అమ్మాయి సంతోషం కోసం ఎంతకైనా త్యాగం చేయటం నాటి ప్రేమకథల మాట. డిజిటల్ యుగంలో ప్రేమకథలు ఎంత దారుణంగా ఉంటాయో.. ప్రేమ పేరిట వారి శాడిజం ఎంత ఎక్కువగా ఉంటుందో తాజా ఉదంతం చూస్తే వామ్మో అనుకోవాల్సిందే. సినిమా కథను తలపించేలా ఉండే ఈ రియల్ కథ 2006లో షురూ అయ్యింది. ఢిలీలోని ఒక కాలేజీలో ఒక అమ్మాయిని జితేందర్ సింగ్ అనే కుర్రాడు ప్రేమించాడు. తన ప్రేమను బయటపెడితే.. అతగాడిని ఆ అమ్మాయి నో చెప్పింది. అంతే.. ఆమె మీద కోపం పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా సాధించాలనుకున్నాడు. అందుకోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
ఇదిలా ఉంటే 2007లో ఆ అమ్మాయిని ఉన్నత విద్య కోసం ఆ అమ్మాయిని అమెరికాకు పంపించేశారు. తన నుంచి దూరం చేయటానికే అమ్మాయి తరఫు వారు ఇలా చేసి ఉంటారన్న కోపాన్ని పెంచుకొని.. అమ్మాయి ఫ్యామిలీని హింసించటం మొదలు పెట్టాడు. దీంతో పోలీసులు ఎంటర్ అయి.. జితేందర్ ను అదుపులోకి తీసుకొని వార్నింగ్ ఇచ్చారు.
దీంతో జాగ్రత్త పడ్డ ఇతగాడు.. తాను ప్రేమించిన అమ్మాయి చదువుతున్న న్యూయార్క్ కాలేజీలో చదివే ప్రయత్నం చేశాడు. అది కుదర్లేదు. ఆమె తన కోర్సు పూర్తి చేసుకొని 2011లో కాలిఫోర్నియాలో ఇంటర్న్ షిప్ కోసం వెళితే.. ఆమెను ఫాలో అయ్యాడు. చివరకు ఆమె అడ్రస్ సంపాదించాడు. అలా ఆమె వివరాలు సంపాదించిన జితేందర్ 2011 నుంచి 2014 వరకూ ఆమెను ఫోన్ నుంచి సోషల్ మీడియాతో వార్నింగ్ లు ఇవ్వటం.. హింసించటం లాంటివి మొదలు పెట్టాడు. చివరకు 2015లో ఆమె ఇంట్లోకి చొరబడటమే కాదు.. ఆమె మీద అఘాయిత్యం చేసే ప్రయత్నం చేయటం.. ఆమె భయంతో కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు వచ్చి ఈ శాడిస్ట్ లవ్వర్ ను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.
ఇతగాడి శాడిజం చూసి ఈ కేసును విచారించిన జడ్జి సైతం ఆశ్చర్యపోయి.. 19 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. తాను అమితంగా ఇష్టపడిన అమ్మాయి కోసం మరీ ఇంతగా హింసించటమా..? వినేందుకే భయంగా ఉన్న ఈ ఉదంతంలో.. బాధితురాలి పరిస్థితి ఎంత భయానకంగా ఉండి ఉంటుందో కదా..?