Begin typing your search above and press return to search.

ఒంగోలు లో 'మన బడి నాడు-నేడు' ...

By:  Tupaki Desk   |   14 Nov 2019 10:04 AM GMT
ఒంగోలు లో మన బడి నాడు-నేడు ...
X
ఆంధప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ..ఏపీలో అధికారం లోకి వచ్చినప్పటి నుండి నిత్యం ప్రజల కోసం పరితపిస్తూ , ప్రజల అవసరాలు తీర్చుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకు పోతున్నారు. అలాగే జగన్ ఒక్కసారి ఏదైనా చెప్తే ..అది చేసే వరకు నిద్ర పోరు. ప్రభుత్వం పై ఎన్ని విమర్శలు , ఆరోపణలు వచ్చినా కూడా వెనుకడుగేసే ప్రసక్తే లేదు. అదే గుండె ధైర్యం తో ఇప్పటికే ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోని అమలు చేస్తున్నాడు. ఇక తాజాగా నేడు బాలల దినోత్సవం సందర్భం గా 'మనబడి నాడు-నేడు' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. గురువారం ఒంగోలు పీవీఆర్‌ బాలుర పాఠశాల లో ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ ప్రారంభించారు.

ఈ సందర్భం గా సీఎం జగన్ మాట్లాడుతూ .. మనబడి నాడు-నేడు లో భాగంగా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లను కేటాయించనున్నట్లు ప్రకటించారు. తొలి దశలో 15,715 పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాల తో అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యార్ధుల పైనే కాకుండా.. కాలేజీ విద్య చదివే వారి కోసం పూర్తి స్థాయి లో ఫీజు రీయంబర్స్ మెంట్ అందిస్తామని ప్రకటించారు. ఇంగ్లీషు మీడియం నిర్ణయం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పేద వారికి ఇంగ్లీషు చదువుల ఉండకూడదా అని ప్రశ్నించారు. ఏ నిర్ణయం తీసుకున్నా పదేళ్ల తరువాత భవిష్యత్ కు మేలు చేసే నిర్ణయాలు ఉండాలని..అందులో వెనుకడుగు వేసేది లేదని మరోసారి స్పష్టం చేసారు.

ప్రపంచం తో పోటీ పడాలంటే ఇంగ్లీషు చదవులు తప్పని సరని అని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. తెలుగు జాతికి అన్యాయం చేస్తున్నానంటూ విమర్శలు చేస్తున్నారని, భవిష్యత్ అవసరాల కు అను గుణంగా పిల్లలను తీర్చి దిద్దాల్సిన అవసరం అందరి పైన ఉందన్నారు. తెలుగు మీడియంలోనే ఉంటే భవిష్యత్ ఉండదని..అదే సమయంలో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తున్నామని జగన్ స్పష్టం చేసారు. ప్రస్తుత పోటీ ప్రపంచం లో పిల్లలకు ఇంగ్లీషు రాక పోతే భవిష్యత్ ఏంటని జగన్ ప్రశ్నించారు. ప్రపంచం తో పోటీ పడాల్సిన పిల్లలు సిగ్గుతో తల దించుకొనే పరిస్థితీలో ఉండకూడదు అని చెప్పారు.