Begin typing your search above and press return to search.

అమిత్ షా సెల్ఫీ దిగితే వివాదమే

By:  Tupaki Desk   |   6 Jun 2016 9:08 AM GMT
అమిత్ షా సెల్ఫీ దిగితే వివాదమే
X
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొత్త వివాదంలో చిక్కుకున్నారు. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ పై విమానంలో దాడి చేసి గాయపర్చిన మానస్ డేకా అనే యువకుడుతో షా సెల్ఫీ దిగడం తీవ్ర దుమారం రేపింది. ష‌రామూమూలుగానే బీజేపీ నాయకత్వం సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

ఏప్రిల్ 24 న ఢిల్లీ నుంచి పుణె వస్తుండగా జెట్ ఎయిర్ వేస్ విమానంలో తనను చూసి వెంటనే గొంతు నులిమి చంపబోయాడంటూ కన్హయ్య కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అరెస్ట్ కు వీలులేని నేరంగా నమోదు చేసిన పోలీసలు ఆ తర్వాత అందులో నిజం లేదని చెప్పినట్లుగా మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అయితే కన్షయ్య మాత్రం డేకా బీజేపీ మద్దతుదారుడని, అతను దాడి చేయడం నిజమని తన ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. పుణెలో ఓ కార్యక్రమానికి అమిత్ షా హాజరయినపుడు డేకా ఈ సెల్ఫీ తీసుకున్నాడు. డేకా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ సెల్ఫీ వివాదంపై కాంగ్రెస్ స్పందిస్తూ ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ విశ్వ‌విద్యాల‌యాల్లో కాషాయీక‌ర‌ణ బీజం వేస్తుంటే ఆయ‌న స‌న్నిహితుడు అయిన బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా సంఘ విద్రోహ శ‌క్తుల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని మండిప‌డింది. బీజేపీ విధానాల‌ను దేశం గ‌మ‌నిస్తున్న‌ద‌ని పేర్కొంది.