Begin typing your search above and press return to search.
ఆ ప్రమాదం ఆమెను ప్రపంచ ఛాంపియన్ ని చేసింది
By: Tupaki Desk | 11 Jun 2022 11:30 PM GMTజీవితం అయిపోయింది అనుకున్న చోటు నుంచి కొత్తగా మొదలు పెట్టి.. ఎన్ని మలుపులు తిరిగినా.. ధైర్యం కోల్పోకుండా అనుకున్నది సాధించేవాళ్లు కొందరే ఉంటారు. అందులో ముందుటుంది రాజ్‌కోట్‌కు చెందిన మానసి జోషి. ప్రపంచ ఛాంపియన్ షట్లర్‌గా కీర్తి సాధించి.. ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్‌గా నిలిచింది. దేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తి గా మారింది.
ఒక్క సంఘటన చాలు.. సాఫీగా సాగుతున్న జీవితాన్ని తలకిందులు చేయడానికి. ఒక్క సంఘటన చాలు.. మన తలరాత మారడానికి. అలాంటి ఓ సంఘటనే జరిగింది మానసి జోషి జీవితంలో. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో ఆమె ఎడమకాలు ఓ ట్రక్ చక్రాల కింద నలిగిపోయింది. ఆ చక్రాల కింద నలిగింది తన శరీరంలోని ఒక అవయమే కానీ.. తన జీవితం కాదు అని మానసి అర్థం చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. రెండు నెలలు మంచానికే పరిమితమైన తనకి రెండే దారులు కనిపించాయి.
ఇలా జరగకుండా ఉండాల్సింది అని బాధపడటం.. ఏం జరిగినా దాన్ని అంగీకరించి భవిష్యత్ గురించి ఆలోచించి ఆ దిశగా ముందడుగేయడం. మానసి రెండో దారిని ఎంచుకుంది. భగవంతుడు తన నుదుటిపై రాసిన జీవితాన్ని సవాల్ చేస్తూ.. తన వైకల్యాన్ని అధిగమించింది. ప్రమాదం జరిగిన మూడో నెలలోనే చేతికర్రకి పనిచెప్పి నడవడం ప్రారంభించింది. తన బాధని బలంగా మార్చుకుని బ్యాడ్మింటన్ రాకెట్ పట్టింది. అప్పటి నుంచి తన క్రీడా జీవితంలో రాకెట్లో దూసుకెళ్తూనే ఉంది.
అలా 2019లో బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా పీవీ సింధు నిలిచిన ఐదు రోజుల తర్వాత, భారత క్రీడాకారిణి మానసి జోషి పారా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఒక ప్రమాదం మాన్సీని ఇంజినీర్ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా మార్చింది. మాన్సీ తన 33వ పుట్టినరోజును ఈరోజు అంటే జూన్ 11న ఘనంగా చేసుకుంటోంది.
మహారాష్ట్రకు చెందిన మానసి జోషికి చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్‌పై ఆసక్తి ఉండేది. ఆమె పాఠశాలలో ఉన్నప్పుడు మాత్రమే జిల్లా స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడేది. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగంపై దృష్టి సారించింది. అనుకున్నట్లుగానే తన కలను కూడా నెరవేర్చుకుంది. అయితే, 2011లో జరిగిన ఓ ప్రమాదం ఆమె జీవితాన్నే మార్చేసింది. ఎనిమిదేళ్ల క్రితం ఆఫీస్‌కి బయలుదేరిన మానసి స్కూటర్‌ని ఎదురుగా వస్తున్న ట్రక్ ఢీకొట్టింది. ఎడమకాలు ట్రక్ చక్రాల కిందపడి నలిగిపోయింది. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. పైగా ఇన్‌ఫెక్షన్ వచ్చింది. దాంతో ఆ కాలిని మోకాలి పైవరకూ తీసేయక తప్పలేదు వాళ్లకి. అలా రెండు నెలలు మంచానికే పరిమితమైంది.
ఆటలు మనిషిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతాయి. ఈ మాటను నమ్మిన మానసి.. తను చిన్నప్పుడే మానేసిన బ్యాడ్మింటన్ను కెరీర్గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. దాని కోసం హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో శిక్షణ ప్రారంభించింది. కేవలం ఒక సంవత్సరంలోనే, ఆమె నేషనల్స్‌లో కాంస్యం గెలుచుకుని పట్టుదలతో మనిషి ఏదైనా సాధించగలడు అనేది మరోసారి రుజువు చేసింది. ఇక్కడ నుంచి ఆమె ఖాతాలోకి పతకాలు పరుగులు పెట్టడం మొదలైంది. మానసి SL3 విభాగంలో పాల్గొంటుంది. వీటిలో ఒకటి లేదా రెండు దిగువ అవయవాలు పని చేయని, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బంది ఉన్న ఆటగాళ్లు పోటీపడుతుంటారు.
అలా తాను పాల్గొన్న ప్రతి పోటీలో తనను తాను మెరుగుపరుచుకోవడం ప్రారంభించింది మానసి. ఓటమిని చూసి కుమిలిపోలేదు.. గెలుపును చూసి పొంగిపోలేదు. తన వంతు ప్రయత్నం చేస్తూ.. వీలైనంత వరకు తన బెస్ట్ ఇవ్వడానికే కృషి చేసింది. మానసి జోషి 8 మార్చి 2022న పారా షట్లర్ల SL3 ర్యాంకింగ్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. 2015లో ఆమె పారా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది. 2016లో పారా ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకుంది. 2017లో కొరియాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2019లో స్వర్ణం సాధించింది.
తాజాగా.. ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవం’ రోజున బార్బీ బొమ్మల తయారీ సంస్థ ‘వన్ ఆఫ్ ఏ కైండ్’ విభాగంలో మానసి రూపంలోని బార్బీబొమ్మని విడుదల చేయడం విశేషం. గతంలో క్రీడాకారిణి నవోమీ ఒసాకా, పర్యావరణవేత్త బిండీ ఇర్విన్ వంటివారిపైన ఇలాంటి బొమ్మలు వచ్చాయి. మనదేశం నుంచి పారాస్పోర్ట్స్ విభాగంలో ఆ గౌరవాన్ని దక్కించుకున్న తొలిమహిళ మానసి.
‘ప్రమాదం తర్వాత జీవితమే లేదనుకున్నా. క్రీడాకారిణిగా మారాక కాళ్లు లేని ఓ పాప ‘నువ్వే నా రోల్ మోడల్ అక్కా..’ అని అనడం నా బాధ్యతని మరింత పెంచింది’ అని చెప్పే మానసి... దివ్యాంగుల హక్కుల కోసం తాను చేస్తున్న పోరాటాన్ని మరింత విస్తృతం చేసింది. ప్రోస్థటిక్ లెగ్ సాయంతో ఆడే మానసి... వాటిపై పెద్ద ఎత్తున పన్నులు వేయడాన్ని నిరసిస్తోంది. ‘నడవడానికి కూడా పన్ను కట్టాలా?’ అని ప్రశ్నిస్తోంది. దివ్యాంగులకు అనుకూలంగా చట్టాలు తేవడం, వారికోసం మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయడంపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలంటోంది.