Begin typing your search above and press return to search.
అబ్బాయ్..ఇప్పుడు అమ్మాయ్ గా ఓటేయనున్నాడు
By: Tupaki Desk | 8 Nov 2017 10:54 AM ISTహాట్ హాట్ గా సాగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరికొద్దిరోజుల్లో కీలకమైన పోలింగ్ దశకు వెళ్లనుంది. ఇలాంటి వేళ.. ఆ రాష్ట్రంలో కొన్ని ఆసక్తికర అంశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. 2012లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఐదేళ్లు పూర్తి అవుతున్న వేళ.. మళ్లీ ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు చెప్పే ఉదంతం ప్రత్యేకత ఏమిటంటే.. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అబ్బాయిగా ఓటు వేసిన స్థానే.. ఈసారి ఎన్నికల్లో అతడు అమ్మాయిగా ఓటు వేయనున్నారు. వడోదరకు చెందిన మానవి వైష్ణవి 2012లో అబ్బాయిగా ఉన్నారు. ఈ ఐదేళ్ల వ్యవధిలో సెక్స్ ఛేంజ్ ఆపరేషన్ చేయించుకొని ఇప్పుడు చూడముచ్చటైన అమ్మాయిగా మారింది. గత ఎన్నికల్లో అబ్బాయిగా ఓటేసిన స్థానే.. ఈసారి ఎన్నికల్లో అమ్మాయిగా ఓటు వేయనుంది.
ఇందుకు సంబంధించిన ఓటరు కార్డును అధికారులు జారీ చేశారు. జన్మతహా అబ్బాయే అయినప్పటికీ తనను తాను అమ్మాయిగా ఫీలయ్యే అతడు.. ఆమె అయ్యాడు. ఇప్పుడు మోడల్ గా వెలిగిపోవాలని తెగ ప్రయత్నిస్తున్న ఆమెకు గుజరాత్ ఎన్నికలు సరికొత్త అనుభూతిని మిగల్చనున్నాయి. ఇప్పుడీ ఉదంతం గుజరాత్ ఓటర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.