Begin typing your search above and press return to search.
ఆదివాసి బిడ్డ.. అదరగొట్టింది!
By: Tupaki Desk | 16 Sept 2020 5:00 AM ISTవేలకువేల ఫీజులు లేవు.. ఎయిర్ కండీషన్ గదులు లేవు.. కోచింగ్ ఇచ్చే నిపుణులైన మాస్టార్లు లేరు.. నిరుపేదలైన తల్లిదండ్రులు.. ఉండేది పూరిగుడిసెలో.. ఇటువంటి సవాళ్ల మధ్యే ఓ ఆదివాసీ బాలిక జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటింది. ప్రతిష్ఠాత్మక జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్‌లో 88.11 శాతం మార్కులు సాధించింది.
గత నాలుగు నెలలుగా కరోనా కారణంగా కళాశాల బంద్ అయ్యింది. అయినప్పటికీ ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. అయితే మమత వద్ద స్మార్ట్‌ఫోన్ లేదు. దీంతో సొంతంగానే ప్రిపేర్ అయ్యింది. కళాశాలలో అధ్యాపకులు ఇచ్చిన నోట్స్.. ఇతరత్రా మెటీరియల్‌తో ప్రిపేర్ అయ్యింది. చివరకు 88.11 శాతం మార్కులు సాధించింది. అయితే తాను 90 శాతం మార్కులు వస్తాయనుకున్నానని మమత కొంచెం నిరాశ వెలిబుచ్చింది. ఇన్ని సవాళ్లమధ్య విద్యనభ్యసించిన మమత ఈ ఘనత సాధించడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆమెను అభినందించారు. తన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్టు మమత చెప్పింది.