Begin typing your search above and press return to search.

ఇబ్రహీం పట్నం చౌరస్తాలో కూర్చున్న మంచిరెడ్డి

By:  Tupaki Desk   |   5 Sept 2016 4:39 PM IST
ఇబ్రహీం పట్నం చౌరస్తాలో కూర్చున్న మంచిరెడ్డి
X
రాజకీయాల్లో సవాళ్లు.. ప్రతిసవాళ్లు మామూలే. ఎవరో ఒకరు సవాలు చేయటం.. అవతలి పక్షం వారు కామ్ గా ఉండటం ఇప్పటివరకూ జరుగుతుంటుంది. అందుకు భిన్నమైన సీన్ ఒకటి తాజాగా చోటు చేసుకోవటమే కాదు.. ఇప్పుడక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గ్యాంగ్ స్టర్ నయింతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని.. నయిం ప్రధాన అనుచరుడు శ్రీహరితో ఉన్న సంబంధాలతో రూ.300 కోట్లు వెనకేసుకొచ్చినట్లుగా కాంగ్రెస్ నేత.. మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తీవ్ర ఆరోపణలు చేయటం తెలిసిందే.

తన దగ్గర ఆధారాలుఉన్నాయని.. దమ్ముంటే ఇబ్రహీం పట్నం చౌరస్తాకు వస్తే.. నయింతో అతనికున్న ఆరోఫణల్ని నిరూపిస్తానంటూ మల్ రెడ్ సవాల్ విసరటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. దీనిపై తాజాగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్పందించారు. సోమవారం మధ్యాహ్నం ఇబ్రహీం పట్నం చౌరస్తాకు వచ్చిన ఆయన బైఠాయించారు. తనపై ఆరోపణలు చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి రావాలని.. వచ్చి నయింతో తనకున్న సంబంధాల్ని నిరూపించాలంటూ సవాలు విసిరారు.

సవాళ్లు విసురుకోవటం మామూలే అయినా.. సవాలుకు స్పందించి.. అధికారపక్ష ఎమ్మెల్యే రోడ్డు మీదకు వచ్చి బైఠాయింటం సంచలనంగా మారింది. కార్యకర్తలతో కలిసి రోడ్డుమీదకు వచ్చిన మంచిరెడ్డితో అక్కడి వాతావరణం హైటెన్షన్ నెలకొంది. మరోవైపు.. సవాలు విసిరిన మల్ రెడ్డి రంగారెడ్డి చప్పుడు చేయకుండా ఉండటం గమనార్హం. మంచిరెడ్డి మీద తాను చేసిన ఆరోపణలకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన మల్ రెడ్డి మౌనంగా ఉండటం ఏమిటి..?