Begin typing your search above and press return to search.

సీఎం జగన్ దంపతులతో మంచు ఫ్యామిలీ లంచ్ మీటింగ్..!

By:  Tupaki Desk   |   29 Jan 2021 4:18 PM GMT
సీఎం జగన్ దంపతులతో మంచు ఫ్యామిలీ లంచ్ మీటింగ్..!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి - వైఎస్ భార‌తి దంపతులను మంచు విష్ణు - విరానికా దంప‌తులు ఈరోజు విజ‌య‌‌వాడ తాడేప‌ల్లిలో క‌లిశారు. బంధువులైన వీరు క‌లిసి సీఏం నివాసంలో లంచ్ చేశారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. లంచ్ కోసం జగన్ అన్న భారతి అక్కలను కలిసామని.. విద్య పట్ల ఆయన దూరద్రుష్టి గొప్పదని.. ప్రజలు అతని ప్రశాంతమైన హ్యూమరస్ సైడ్ గురించి ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ - విష్ణు ఫ్యామిలీ కలిసి తీసుకున్న పిక్ ని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపోతే వైఎస్ ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి మధ్య బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు సుధాకర్ రెడ్డి కుమార్తె విరానికా రెడ్డిని మంచు విష్ణు ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి మంచు వారికి వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఏర్పడింది. అలానే మంచు మోహన్ బాబు జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీలో జాయిన్ అయ్యాడు. జగన్ విధానాలను సమయం వచ్చినప్పుడల్లా కొనియాడుతూ ఉన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే మంచు విష్ణు నటించిన 'మోసగాళ్ళు' సినిమా శివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల కానుంది.