Begin typing your search above and press return to search.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంచు లక్ష్మి సెటైరికల్ ట్వీట్..!
By: Tupaki Desk | 7 Nov 2020 11:00 PM ISTకలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఓ వైపు వెండితెర మరోవైపు బుల్లితెరలపై రాణిస్తోంది. సినిమాలు - వెబ్ సిరీస్ లలో నటించడమే కాకుండా పలు టాక్ షో లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మంచు లక్ష్మి ఫ్యామిలీ విషయాలను షేర్ చేసుకోవడంతో పాటు సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్తూ ఉంటుంది. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై స్పందించి మరోసారి వార్తల్లో నిలిచింది మంచు లక్ష్మి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ప్రత్యర్థి జో బైడెన్ అధిక స్థానాల్లో విజయం సాధించి విజయానికి చేరువయ్యారని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడనప్పటికీ ట్రంప్ వైట్ హౌస్ ని విడిచి వెళ్లే సమయం ఆసన్నమైందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. పెద్దన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి ఓ సెటైరికల్ ట్వీట్ చేసింది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ తొంగి చూస్తూ చూస్తూ 'అతను ఇంకా వెళ్లిపోలేదా?' అని అడుగుతున్నట్లు ఓ ఫోటో షేర్ చేసింది మంచు లక్ష్మి. దీనికి #USElectionResults2020 అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది.