Begin typing your search above and press return to search.
మా ఆస్తులు అమ్ముకోవాలా చెప్పండి
By: Tupaki Desk | 8 March 2019 12:20 PM GMTమంచు ఫ్యామిలీ మెల్లిమెల్లిగా హీట్ పెంచుతోంది. వారం రోజుల క్రితం తన కాలేజీకి రావాల్సి ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ బకాయిల్ని ఏపీ ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదని.. అసలు ఎందుకు లేట్ అవుతందో తనకు అర్థం కావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. అయితే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కామెంట్స్ ని ఏపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్లు కన్పించడం లేదు. దీంతో.. ఇప్పుడు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు రంగంలోకి దిగాడు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోతే.. తమ ఆస్తులు అమ్మి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని అన్నాడు.
మంచు ఫ్యామిలీకి తిరుపతి సమీపంలో ఇంజినీరింగ్ కాలేజి ఉంది. వేలమంది ఇక్కడ చదువుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పేరుతో ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించడం లేదని.. ఇప్పటికే తమకు దాదాపు రూ.18 కోట్ల రూపాయలు రావాలని ప్రకటించారు మోహన్ బాబు. అయితే.. మోహన్ బాబు వైసీపీకి దగ్గర అవ్వడం.. మంచు విష్ణు వైఎస్ దగ్గరి బంధువు కుమార్తెను పెళ్లిచేసుకోవడంతో.. కావాలనే మోహన్ బాబు కాలేజీకి బకాయిలు చెల్లించడం లేదని ఆరోపణలు విన్పిస్తున్నాయి. అదే సమయంలో శాంతారం కాలేజీకి మాత్రం అన్ని బకాయిలు క్లియర్ అయ్యాయని మంచు విష్ణు అన్నారు. కేవలం ప్రభుత్వానికి అండగా ఉన్నందుకే వారి బకాయిల క్లియర్ అయ్యాయని చెప్పిన మంచు విష్ణు.. కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వానికి కొమ్ముకాయడం కరెక్ట్ కాదని ఆరోపించారు.
మరోవైపు.. చాలా కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ వైఖరిపై కక్కలేక.. మింగలేక సతమతమవుతున్నాయని మంచు విష్ణు అన్నాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆస్తులు అమ్మేసుకుని వేతనాలు చెలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాడు. ప్రభుత్వం ఫీజులు సక్రమంగా చెల్లిస్తోంది అని అపెక్కా చెబుతోందని కానీ ఇంతవరకు బకాయిలు రాలేదని అన్నాడు. దీనిపై ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించాడు మంచు విష్ణు. మోహన్ బాబు కుటుంబం అప్పుడప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై పరోక్షంగా విమర్ళలు చేసింది కానీ ఇలా ప్రత్యక్షంగా ఎదురుదాడికి దిగడం ఇదే తొలిసారి.