Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు మంద కృష్ణ శాపం

By:  Tupaki Desk   |   9 May 2017 7:38 AM GMT
చంద్రబాబుకు మంద కృష్ణ శాపం
X
ఏపీ సీఎం చంద్రబాబుకు మరో కుల సెగ మొదలు కానుంది. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంతో తరచూ తలనొప్పి ఎదుర్కొంటున్న చంద్రబాబుకు త్వరలో మరో కులం నుంచి కూడా గట్టి ప్రతిఘటన ఎదురుకానున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. అది... ఈసారి మాదిగల నుంచి ఉంటుందని తెలుస్తోంది. ఆ వర్గానికి చెందిన ఉద్యమ నేత, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ తాజాగా చంద్రబాబుపై మండిపడ్డారు. మాదిగలను మోసగిస్తున్న చంద్రబాబుకు వారి శాపం తగులుతుందంటూ ఆయన శాపం పెట్టారు.

టీడీపీ విజయంలో మాదిగలు కీలకపాత్ర పోషించారని... అయినప్పటికీ చంద్రబాబు మాలలను దగ్గరకు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గత కొద్దికాలంగా చంద్రబాబు రాజకీయంగా వేస్తున్న ఎత్తుగడలను పరిశీలించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

కాగా వచ్చే నెల 7వ తేదీన అమరావతిలో భారీ బహిరంగసభ నిర్వాహించేందుకు మంద కృష్ణ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో ఏర్పాటు చేసే ఈ భారీ సభలో టీడీపీ ప్రభుత్వాన్ని ఎండగడతామని ఆయన చెబుతున్నారు.

కాగా మంద కృష్ణ ఒకప్పుడు చంద్రబాబుకు మంచి మిత్రుడే. పలు ఎన్నికల్లో మాదిగల ఓట్లు చంద్రబాబు పడేలా ఆయన సహకరించారు. ఎస్సీల వర్గీకరణకు చంద్రబాబు సహకరిస్తారన్న ఆశతో ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు వాడుకుని వదిలేశారని చెబుతారు. చంద్రబాబు ఇప్పుడు వర్గీకరణ ఊసే ఎత్తకపోవడంతో మంద కృష్ణ ఆగ్రహిస్తున్నారు.