Begin typing your search above and press return to search.
బాబు నమ్మకద్రోహి..మాట తప్పే మనిషి
By: Tupaki Desk | 12 Jun 2017 6:05 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మాదిగల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ధ్వజమెత్తారు. వచ్చే నెల అమరావతిలో జరగనున్న మాదిగల కురుక్షేత్ర మహాసభకు సంబంధించి ఆదివారం చిత్తూరులో సన్నాహక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నమ్మక ద్రోహి అని, మాదిగల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా మాదిగలకు అన్యాయమే జరిగిందని ఆరోపించారు.
ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చి తానే పెద్ద మాదిగనని సంక్షేమానికి పాటుపడుతానని తెలిపారని మందకృష్ణ గుర్తుచేశారు. అయితే నేడు అందుకు విరుద్ధం గా ప్రవర్తిస్తూ మాదిగల జీవితాలతో ముఖ్యమంత్రి చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అనంతరం చిత్తూరు నుంచి పుంగనూరులో జరిగే సన్నాహక సభకు బయలుదేరి వెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకొని మంద కృష్ణమాదిగతో పాటు మరికొంత మంది ఎంఆర్ పిఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి యాదమరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. చిత్తూరు జిల్లాలో పోలీసుల అనుమతి లేకుండానే ఈ సభలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, అందుకే అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/