Begin typing your search above and press return to search.
ఇద్దరు సీఎంలతో ఊచలు లెక్కబెట్టించాలట
By: Tupaki Desk | 23 Jun 2015 12:30 PM GMTఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఏపీ, తెలంగాణ సీఎంలు ఇద్దరికీ గడ్డి పెట్టారు. ఇద్దరు ముఖ్యమంత్రులదీ తప్పుందని... ఇద్దరినీ అరెస్టు జైల్లో పెట్టాలని ఆయన కుండబద్దలు కొట్టేశారు.
ఫోన్ ట్యాపింగ్ జరగడం వాస్తవం... అలాగే చంద్రబాబు స్టీఫెన్సన్ సంభాషించడమూ వాస్తవం... అని చెబుతున్న రిగింది వాస్తవమేనని, అందులో మాట్లాడింది నిజమేనని, ట్యాపింగ్‌తో పాటు ఓటుకు నోటు వ్యవహారంలో ఇద్దరు ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లవలసిందేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సోమవారం అన్నారు. ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఒకరు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఎదుటివారి గుట్టును తెలుసుకునే ప్రయత్నాలు చేస్తే, మరొకరు నోట్లతో ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉండే మంద కృష్ణ మాదిగ ఇలా ఆయనజైలుకెళ్లాల్సిందేనంటూ మాట్లాడడం గతంలో ఎన్నడూ లేదు. రాజకీయంగా రెండు రాష్ట్రాల్లోనూ కష్టాల్లో ఉన్న కృష్ణ మాదిగ ఇద్దరు సీఎంలపై విరుచుకుపడడంలో వింతేమీలేదని విశ్లేషకులు అంటున్నారు.