Begin typing your search above and press return to search.
కేసీఆర్ పై సినిమాకు వాళ్లు రెడీ అయిపోయారు
By: Tupaki Desk | 1 Jan 2016 7:51 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు అంటే తెలంగాణలో ఎంతో క్రేజ్. తెలంగాణవాదానికే కాదు తెలంగాణ అస్తిత్వానికి ఆయన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చారు. అయితే అభిమానులు ఎందరున్నా... వ్యతిరేకులు కూడా ఉండటం అత్యంత సహజమైన విషయమే కదా. ఇపుడు ఆ వర్గం వారే కేసీఆర్ పై సినిమా తీసేందుకు రెడీ అయిపోయారు.
ఎంఆర్ పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కేసీఆర్ అంటేనే ఇంతెత్తున ఎగిరిపడుతుంటారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో పట్టువదలని పోరాటం చేస్తున్న మందకృష్ణ ఇందుకోసం ఫిబ్రవరి 2, 3 తేదీల్లో నిరవధిక దీక్షకు కూర్చుంటానని ప్రకటించారు. రెండో తేదీన లక్షలాది మందితో అసెంబ్లీ ఎదుట ప్రదర్శన చేస్తామని, మూడో తేదీన రోడ్లను దిగ్బంధిస్తామని చెప్పారు. "కేసీఆర్ మాదిగ వ్యతిరేకి. భిక్షమెత్తయినా ఆయన మోసాలపై సినిమా తీస్తా" అని ఈ సందర్భంగా ప్రకటించారు.
పనిలో పనిగా మిగతాపార్టీలపైనా విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో అండగా ఉన్న మాదిగలను ఉద్యమానికి దూరం చేసి శత్రువని చెప్పిన చంద్రబాబుతో కేసీఆర్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని మందకృష్ణ మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజులలో వర్గీకరణ బిల్లు పెడతామని చెప్పిన వెంకయ్యనాయుడు 18 నెలలైనా ఆ ఊసే ఎత్తట్లేదని ఆరోపించారు.