Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ - కోదండంతో పాటు ఆయన కూడా!
By: Tupaki Desk | 11 Feb 2018 4:24 AM GMTవేసవి రాకముందే తెలంగాణలో రాజకీయంగా ఉక్కపోతలు మొదలయ్యాయి. అధికార తెరాస - విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిత్యం సవాళ్లు - ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత ఎన్నికల కోలాహలం ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికే అందుకు తగిన అడుగులు పడుతున్నాయి. తెలంగాణరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ - టీడీపీ - టీఆర్ ఎస్ - బీజేపీలకు ప్రత్యామ్నాయంగా వామపక్షాలు - ఇతర సామాజిక శక్తుల ఆధ్వర్యంలో ఇప్పటికే బహుజన లెఫ్ట్ ప్రంట్(బీఎల్ ఎఫ్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది వ్యక్తులు - కొన్ని పార్టీలతో కలిసి ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ఫ్రంట్ దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయని 'మహాకూటమి' - 'సామాజిక తెలంగాణ సాధన ఫ్రంట్' - ప్రజా ఫ్రంట్ వంటి పేర్లను కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి విభజన అనంతరం ఆ పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందాన మారింది. తెలంగాణ ఇచ్చామని ఆ పార్టీ పెద్దలు చెబుతున్నా ఇక్కడి జనం నమ్మటంలేదు. మరోవైపు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ ఆ పార్టీని అనేక బలహీనతలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా అంతర్గత కుమ్ములాటలు - గ్రూపు తగాదాలు - ముఖ్యమంత్రి పదవి కోసం నేతల మధ్య తీవ్రమైన పోటీ - చిన్న చిన్న విషయాలకే ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోవడం వంటి కారణాల వల్ల ఆ పార్టీ ప్రజల్లో విశ్వాసం పొందలేకపోతున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీన్నుంచి బయట పడి టీఆర్ ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ ఏర్పాటును తెరపైకి తేవడం అందులో భాగంగా తెలుస్తోంది.
ఇన్ని ఇబ్బందులున్న నేపథ్యంలో...అధికారం అంత సులువు కాదని..టీఆర్ ఎస్ ను వ్యతిరేకించే వర్గాలను - సమూహాలను తమవైపు తిప్పుకుంటే..2019లో ఎన్నికల నావ గట్టెక్కించవచ్చన్న భావన కాంగ్రెస్ నేతల్లో ఉంది. అందులో భాగంగా..వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలు - ప్రజాసంఘాలు - కుల సంఘాల నాయకులతో ఆ పార్టీ నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. దీనికి తోడుగా టీజేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడబోయే పార్టీని కూడా రంగంలోకి దింపుతున్నారు.
ఇప్పటికే కోదండరాంతో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ - ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మెన్ కొప్పుల రాజు - కుంతియా - జానారెడ్డి - ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రాథమికంగా చర్చలు జరిపారు. ఈ భేటీలో కూడా కోదండరాం పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ కుంతియాతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఆయన కూడా టీఆర్ ఎస్ ను ఓడించడానికి కాంగ్రెస్ తో జతకట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. స్థూలంగా రాబోయే ఒకటి రెండు నెలల్లో ఈ కూటమికి ఒక రూపం రావచ్చునని తెలుస్తోంది.