Begin typing your search above and press return to search.
అమరావతిలో కురుక్షేత్రమట
By: Tupaki Desk | 29 Jun 2017 6:03 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట - అధికారంలోకి వచ్చిన తర్వాత మరోమాట మాట్లాడుతున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మాదిగల పెద్ద కొడుకును అవుతానని మాదిగల డప్పుకొట్టి మరీ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయకుండా తాత్సారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. డప్పు కొట్టి మరీ ఇచ్చిన హామీని వదిలేశారేమని ప్రశ్నించారు. తన సత్తా చాటేందుకు జూలై 7న అమరావతిలో జరగనున్న మాదిగల కురుక్షేత్ర మహాసభకు శ్రీకారం చుట్టామని మందకృష్ణ తెలిపారు. మాదిగల కురుక్షేత్ర సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈనెల 12వ తేదీ నుంచి రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తూ కృష్ణాజిల్లాలోని పలు దేవాలయాల్లో పూజలు చేశారు.
గుడివాడలోని స్థానిక మెయిన్ రోడ్డులోని శ్రీ విఘ్నేశ్వరస్వామి - ఐఎంఎ రోడ్డులోని ఫుల్ గాస్పెల్ చర్చిల్లో మందకృష్ణ మాదిగ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ 2014లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో దళితుల్లో మాదిగల సహకారంతోనే చంద్రబాబు గెలుపొందారని మందకృష్ణ గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు హామీ ఇవ్వడం వల్లే తామంతా ఆ పార్టీకి మద్దతు తెలిపినట్టు చెప్పారు. కానీ ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్ కల్పిస్తామని నమ్మించడం వల్లే పవన్ కల్యాణ్ తోపాటు పలువురు కాపు నేతలు చంద్రబాబుకు మద్దతు తెలిపారన్నారు. అయితే ఇచ్చిన మాట తప్పడంతోపాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను తాను మాత్రం అనుభవిస్తూ మిగిలిన వారిని అణగదొక్కడం ఏమి న్యాయమని సీఎం చంద్రబాబును మందకృష్ణ సూటిగా ప్రశ్నించారు. పోరాటమే శరణ్యమని భావించి జూలై 7న అమరావతిలో మాదిగల కురుక్షేత్ర మహాసభ ఏర్పాటుచేసినట్లు మందకృష్ణ వివరించారు. ఈ సభ విజయవంతం అయ్యేందుకు తనకు శక్తి - ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని అన్ని గుళ్లల్లోనూ దేవుళ్లను వేడుకుంటున్నట్టు చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు మాదిగలతోపాటు ఉపకులాలు పాల్గొనాలని కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/