Begin typing your search above and press return to search.

దసపల్లాలో మందకృష్ణకు బాబు ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   18 March 2015 7:03 AM GMT
దసపల్లాలో మందకృష్ణకు బాబు ఏం చెప్పారు?
X
ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపుగా 20 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ సంస్థ తాజాగా ఏపీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వభిస్తోంది. ఈ సందర్భంగా పెద్దఎత్తున ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు పెద్దఎత్తున అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకొని అదుఉలోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తమకు మాట ఇచ్చి మోసం చేశారంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు విశాఖపట్నంలోని దసపల్లా హోటల్‌ వద్ద పిలిపించుకొని మాట్లాడారని.. ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోవాలని.. వర్గీకరణ అంశాన్ని సాధించే విషయాన్ని తనకు అప్పజెప్పాలని చంద్రబాబు స్వయంగా తనతో చెప్పినట్లు మందకృష్ణ చెబుతున్నారు.

అందుకే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు పూర్తిస్థాయిలో తమ మద్దతు ప్రకటించి గెలిపించామని చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్న సమయంలో చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర తెలంగాణలో సాగని పరిస్థితి ఉంటే.. వర్గీకరణపై బాబు ఇచ్చిన హామీతో తాము ముందు ఉండి మరీ.. బాబుకు మద్దతు ఇచ్చామన్నారు.

అనాడు వర్గీకరణ చేసి మాదిగల రుణం తీర్చుకుంటానని.. పెద్ద మాదిగ అని అనిపించుకుంటానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం వర్గీకరణ విషయంలో మాట్లాడటం లేదని విరుచుకుపడ్డారు. మొత్తానికి నిరసన సందర్భంగా మందకృష్ణ చెబుతున్న దసపల్లా హోటల్‌ ఎపిసోడ్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది.